top of page

Amazon, Flipkart Republic Day sale: అమెజాన్ వర్సెస్ ఫ్లిప్ కార్ట్.. కనివినీ ఎరుగని ఆఫర్ల వరద

  • Writer: Raju Shaik
    Raju Shaik
  • Jan 15, 2021
  • 2 min read

జనవరి 20 నుంచి లైవ్ సేల్స్ మొదలు పెట్టనున్న అమెజాన్ జనవరి 23 వరకూ రిపబ్లిక్ డే సేల్స్ లో ఆఫర్ల పర్వం కొనసాగించనుండగా.. ఫ్లిప్ కార్ట్ మాత్రం జనవరి 24 వరకు ఆఫర్ల వరదను కొనసాగించనుంది.

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో రిపబ్లిక్ డే సేల్స్ ఫీవర్ ప్రారంభానికి ముందే మార్కెట్లో హీట్ రాజుకుంటోంది. జనవరి 20 నుంచి లైవ్ సేల్స్ మొదలు పెట్టనున్న అమెజాన్ జనవరి 23 వరకూ రిపబ్లిక్ డే సేల్స్ లో ఆఫర్ల పర్వం కొనసాగించనుండగా.. ఫ్లిప్ కార్ట్ మాత్రం జనవరి 24 వరకు ఆఫర్ల వరదను కొనసాగించనుంది. అమెజాన్, ఫ్లిప్ కార్టులు 2021 ఏడాదికి గానూ ఫస్ట్ మెగా సేల్స్ ప్రకటించి కస్టమర్లను అప్పుడే తెగ ఆకట్టుకుంటున్నాయి. పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై కనివినీ ఎరుగని డిస్కౌంట్లతో రెండు సంస్థలు పోటాపోటీగా సేల్స్ ను ప్రారంభిస్తుండటం విశేషం. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు మాత్రం ఒకరోజు ముందే అంటే జనవరి 19 నుంచే ఈ ఆఫర్లను అందుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్ జనవరి 20న ప్రారంభమై జనవరి 24న ముగియనుంది. ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్స్ లో స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై ప్రత్యేక తగ్గింపును రిపబ్లిక్ డే సేల్స్ లో భాగంగా ప్రకటించాయి.


ఊరించే బ్యాంక్ ఆఫర్స్ కూడా..

ఈ ఆఫర్లను SBI కార్డు ద్వారా వినియోగించుకునేవారు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక క్రెడిట్ ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ కావాలంటే బజాజ్ ఫిన్ సర్వ్ ఈఎంఐ కార్డు, Amazon Pay ICICI Credit card, Amazon Pay Later, ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులపై కూడా ఈ వెసులుబాటును పొందవచ్చు. HDFC కార్డు వినియోగదారులైతే 10శాతం అదనపు డిస్కౌంటును పొందవచ్చు.


ఇంతకీ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో మిస్ కాకూడని హ్యాండ్ పిక్డ్ లిస్ట్ డీల్స్ ఏంటో మీకు తెలుసా?


Flipkart Big Savings Daysలో ఇవే హాట్ కేక్స్..

మీకు మంచి స్మార్ట్ ఫోన్ బడ్జెట్ లో కావాలనుకుంటే Flipkart Big Savings Daysలో ఊరించే Moto G 5G ని అస్సలు మిస్ కాకండి. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ లో దీని ధర కేవలం 18,999 రూపాయలు మాత్రమే. ఇప్పటికే మోస్ట్ అఫోర్డబుల్ 5 జీ స్మార్ట్ ఫోన్ గా మనదేశంలో రికార్డు సృష్టించిన Moto G Snapdragon 750Gని మనదేశంలో పరిచయం చేస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ కావటం మరో హైలైట్.


Samsung Galaxy F41 స్మార్ట్ ఫోన్ ధర కేవలం 13,999 రూపాయలే కాగా ప్రీ పేమెంట్ ఆఫ్ గా రూ.1000 డిస్కౌంట్ కూడా ఉంది. 6000mAh బ్యాటరీతో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ Exynos 9611 ప్రాసెసర్ , సూపర్ AMOLED డిస్ప్లేతో కళ్లు చెదిరేలా ఉంటుంది. ట్రిపుల్ కెమరా సెటప్ ఉన్న ఈ ఫోన్ లో 64MP, 8MP, 5 MP కెమరా సెన్సార్స్ ఉన్నాయి.


Samsung Note 10+ కేవలం 49,999కే రిపబ్లిక్ డే సేల్ లో లభిస్తుంది. Motorola One Fusion ఏకంగా 15,999కే ఆఫర్లో సొంతం చేసుకోవచ్చు. Samsung S20+ 44,999కే ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ లో హాట్ కేక్ లా అందుబాటులోకి రానుంది.


Amazon Republic Day saleలో ఊరించే వస్తువులు ఇవే..


అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ లో OnePlus, Samsung, Xiaomi, LG, Bosh, HP, Lenovo, JBL, boAt Sony, Amazfit, Canon, Fujifilm..వంటి ఎన్నో వస్తువులపై ఆకట్టుకునే డీల్స్ ఉండనున్నాయి. అయితే కచ్ఛితంగా ఆ డీల్స్ ఏంటో మాత్రం అమెజాన్ ఇంకా వెల్లడించకపోవటం విశేషం. కానీ ఇప్పటికే చేసిన ప్రకటన ప్రకారం ..మొబైల్స్, యాక్సెసరీస్ పై 40శాతం వరకు ఆఫర్ ఇవ్వనుంది. ఎలక్ట్రానిక్స్ పై 60శాతం వరకూ ఆఫ్ ఇచ్చి, లార్జ్ అప్లయనెన్స్ పై 50శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. అమెజాన్ ఎకో, ఫైర్ టీవీ, కిండ్ల్ డివైజులపై 40శాతం వరకు ఆఫర్ ఇవ్వనున్నట్టు అమెజాన్ గతంలోనే వివరించింది. ఇక iPhone 12 mini, Samsung Galaxy M31s, Redmi Note 9 Pro, OnePlus 8 Pro 5G, Oppo A31వంటి పాపులర్ డివైజులపై కూడా కనివినీ ఎరుగని ఆఫర్లు ఇవ్వనున్నట్టు అమెజాన్ వివరించింది.

Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Instagram
  • Pinterest

©2020 by a2z News99

bottom of page