top of page

వాట్సప్‌లో ఈ సెట్టింగ్ చాలా ముఖ్యం... వెంటనే మార్చేయండి

  • Writer: Raju Shaik
    Raju Shaik
  • Mar 31, 2021
  • 2 min read

మీ వాట్సప్ అకౌంట్‌ని సేఫ్‌గా మార్చాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ సెట్టింగ్స్ చేయండి.

మీరు వాట్సప్ వాడుతున్నారా? వాట్సప్ యాప్ సెక్యూరిటీ కోసం మీరు సెట్టింగ్స్ సరిగ్గా చేశారా? ఒకప్పుడు వాట్సప్ కేవలం మెసేజెస్‌కు పంపడానికి, ఛాటింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడే యాప్‌గా ఉండేది. కానీ వాట్సప్‌లో అనేక ఫీచర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇమేజెస్, ఫోటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్ షేర్ చేసుకుంటున్నాం. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. వాట్సప్‌లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువమంది వాట్సప్ ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వాట్సప్ ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో యూజర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. స్మార్ట్‌ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్తే సులువుగా వాట్సప్ యాక్సెస్ చేయొచ్చు. అంతేకాదు... సిమ్ కార్డుతో వేరే స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసి పాత ఫైల్స్ అన్నీ రీస్టోర్ చేయొచ్చు. అందుకే స్మార్ట్‌ఫోన్ పోయిందంటే ఆ ఫోన్ దొరికినవారి చేతుల్లోకి వాట్సప్ అకౌంట్ కూడా పోయినట్టే. అందుకే వాట్సప్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సెక్యూరిటీ విషయంలో సెట్టింగ్స్ మార్చుకోవాలి.



వాట్సప్ అనేక సెక్యూరిటీ ఫీచర్స్ అందిస్తోంది. అందులో ముఖ్యమైనది టూ-స్టెప్ వెరిఫికేషన్. సాధారణంగా ఏదైనా స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే సిమ్ కార్డ్ ఉంటే చాలు. ఆ మొబైల్ నెంబర్‌కు వచ్చే 6 అంకెల కోడ్ ఎంటర్ చేస్తే చాలు. వాట్సప్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఎవరి సిమ్ కార్డ్ దొరికినా వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఇలా ఎవరంటే వాళ్లు వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేయకుండా అడ్డుకోవడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ ఉపయోగపడుతుంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే 6 అంకెల కోడ్ మాత్రమే కాదు... మీరు క్రియేట్ చేసిన మరో 6 అంకెల కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టూ-స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్స్ ద్వారా మీరు 6 అంకెల కోడ్‌ను మరో అదనపు సెక్యూరిటీ ఫీచర్‌గా ఉపయోగించుకోవచ్చు. మరి ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి.


WhatsApp Two-step verification Settings: వాట్సప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్స్ చేయండి ఇలా...

  1. ముందుగా మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.

  2. కుడివైపు టాప్‌లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి.

  3. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.

  4. ఆ తర్వాత అకౌంట్ ఓపెన్ చేయండి.

  5. అందులో Two-step-verification పైన క్లిక్ చేయండి.

  6. టూ స్టెప్ వెరిఫికేషన్ ఓపెన్ చేసి ఆరు అంకెల పిన్ ఎంటర్ చేయండి.

ఈ పిన్ మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అకౌంట్ లాగిన్ కావాలంటే మీరు క్రియేట్ చేసిన 6 అంకెల పిన్ తప్పనిసరి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఈ కోడ్ తప్పనిసరి. మీరు వాట్సప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్స్ చేస్తారు కాబట్టి ఎవరైనా మీ వాట్సప్ అకౌంట్ హ్యాక్ చేసినా యాప్ ఓపెన్ చేయాలంటే ఈ పిన్ కావాల్సిందే.



Comentarios


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Instagram
  • Pinterest

©2020 by a2z News99

bottom of page