top of page

Aadhar: ఆధార్​ కోసం గంటల కొద్ది క్యూల్లో నిలబడొద్దు.. ఆన్​లైన్​లో అపాయింట్​ బుక్ చేసుకోండిలా

  • Writer: Raju Shaik
    Raju Shaik
  • Jan 4, 2021
  • 1 min read

ఆధార్ కార్డుకు సంబంధించి సేవలు పొందాలనుకునే వారు పోస్టాఫీసులు, బ్యాంకుల వద్ద భారీ క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేకుండా.. ఆధార్ సేవా కేంద్రాల ద్వారా సులభంగా పని పూర్తి చేసుకోవచ్చు. ఆన్​లైన్​లో అపాయింట్ ఎలా బుక్ చేసుకోవాలంటే..

ఆధార్​ కార్డు కొత్తగా తీసుకోవాలన్నా.. ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాన్నా మీరు పోస్టాఫీసులు, బ్యాంకులు, కార్యాలయాల వద్ద గంటల కొద్ది క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. కేవలం ఆధార్ కోసం ప్రత్యేకంగా ఆధార్ సేవ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అచ్చం పాస్​పోర్టుకు అపాయింట్​మెంట్ బుక్ చేసుకున్నట్టే ఆధార్ కోసమూ ఈ కేంద్రాల్లో టైమ్​ను బుక్ చేసుకోవచ్చు. దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ట్వీట్లను ది యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) రీట్వీట్ చేస్తోంది.


అలాగే ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఆధార్ సేవా కేంద్ర ఆన్​లైన్ అపాయింట్​మెంట్ విధానాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు కొందరు ట్విట్టర్ యూజర్లు సూచిస్తున్నారు. టోకెన్ల విధానంతో సేవా కేంద్రాల నిర్వహణ అద్భుతంగా ఉంటోందని, కేవలం 20 నిమిషాల్లోనే తన ఆధార్ పని ఎంతో ప్రశాంతంగా అయిపోయిందని ఓ ట్విట్టర్ యూజర్ తెలిపారు. ఈ ట్వీట్​కు విశేష స్పందన లభించింది.


ఆన్​లైన్​లో ఆధార్ సేవా కేంద్ర అపాయింట్​మెంట్​ బుక్ చేసుకోండిలా..

  • అపాయింట్​మెంట్ బుక్ చేసుకోవాలంటే, ముందుగా uidai.gov.in వెబ్​సైట్​కు వెళ్లాలి.

  • అక్కడి నుంచి "My Aadhaar" డ్రాప్ డౌన్ మెనూ ఆర్షన్​లోకి వెళ్లి "Book an Appointment" పై క్లిక్ చేయాలి.

  • అక్కడ డ్రాప్ డౌన్ మెనూలో నగరం, లొకేషన్​ను ఎంచుకోవాలి. ఆ తర్వాత “ప్రొసీడ్​ టు బుక్ అపాయింట్​మెంట్​”పై క్లిక్ చేయాలి

  • అక్కడ ఫోన్ నంబర్​ను ఎంటర్ చేసి.. వెరెఫికేషన్ కోసం ఫోన్​కు వచ్చే ఓటీపీని సమర్పించాలి.

  • ఆ తర్వాత ఆధార్​ వివరాలు, వ్యక్తిగత సమాచారం సబ్మిట్ చేయాలి.

  • ఆ తర్వాత మనకు అనువైన సమయంలో ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లేందుకు టైమ్​ను ఎంపిక చేసుకోవాలి.

  • అప్పుడు ఓ అపాయింట్​మెంట్ నంబర్ వస్తుంది.

  • ఆధార్ సేవ కేంద్ర కూడా పాస్​పోర్ట్ కేంద్ర లాంటిదే. అక్కడ టోకెట్ సిస్టం ఉంటుంది. ముందుగా టోకెన్ తీసుకొని డాక్యుమెంట్లను చెక్ చేయించుకోవాలి. ఆ తర్వాత క్యాష్ కౌంటర్​కు వెళ్లి సేవకు తగిన డబ్బును చెల్లించాలి.

  • ఆ తర్వాత మీకు కేటాయించిన వర్క్ ఆపరేటర్ కౌంటర్ దగ్గర టోకెన్ నంబర్లు ప్రదర్శిస్తారు. మీ టోకెన్ సంఖ్య వచ్చినప్పుడు ఆపరేటర్ దగ్గరికి వెళ్లాలి.

ప్రస్తుతం ఆధార్ కేంద్రాలు అందిస్తున్న సేవలు

  • కొత్తగా ఆధార్ నమోదు

  • పేరు మార్పు, అడ్రస్​, మొబైల్ నంబర్​, ఈమెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్​ మార్పు, బయో మెట్రిక్​ (ఫొటో, ఫింగర్​ప్రింట్​, ఐరిస్​) నమోదు, మార్పులు.

Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Instagram
  • Pinterest

©2020 by a2z News99

bottom of page