Air on Sale: నీటిలాగే గాలిని కూడా బాటిల్లో అమ్ముతున్నారు
- Raju Shaik
- Dec 26, 2020
- 1 min read
మనిషి ముక్కు 10 వేల వాసనలను పసిగట్టగలదట. మన మైండ్ వాసనతో ఒక ప్రదేశాన్ని గుర్తుపెట్టుకుంటుందట

నీటి తరువాత ఇప్పుడు గాలి కూడా బాటిల్స్‌లో (Bottled Air) అందుబాటులోకి వస్తోంది. ఎయిర్ బాటిల్స్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది ఒక సంస్థ. క్రిస్మస్ సందర్భంగా కొత్త ఆలోచనతో వచ్చింది ఒక కంపెనీ

500 ఎంఎల్ గాలి ధర రూ.2400 మాత్రమే...

బ్రిటన్‌కు చెందిన ఒక సంస్థ స్వచ్ఛమైన గాలిని 500 ఎంఎల్ బాటిల్స్‌లో అమ్ముతున్నారు. దీని ధర సుమారు రూ.2400.
ఈ బాటిల్లో ఉన్న గాలిని పీల్చి తమ సొంత ఊరిలో ఉన్నట్టు ఫీల్ అవ్వవచ్చు అని సంస్థ తెలిపింది.
మీరు ఒక ప్రత్యేక స్థలానికి సంబంధించిన గాలిని అనుభూతి చెందాలి అనుకుంటే ఈ బాటిల్స్‌ను సొంతం చేసుకోవచ్చు.
Comments