Almond Benefits: బాదంను నానబెట్టి తినాలా? నేరుగా తినాలా? ఏది మంచిది?
- Raju Shaik
- Dec 25, 2020
- 2 min read
Almond Benefits: బాదంను నానబెట్టి తినాలా? నేరుగా తినాలా? ఏది మంచిది?

బాదం పప్పు అంటే అందరికీ ఇష్టమైన నట్స్. పోషకాలు పుష్కలంగా ఉన్న బాదంను ఎలా తినాలి? అంటే నానబెట్టి తినాలా? లేక వేయించి తినాలా? అదికాక పోతే పచ్చివే నేరుగా తినాలా? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదని తరచూ అనుమానం వస్తోందా అయితే జస్ట్ రెండు నిమిషాల్లో ఇది చదివేయండి. మీ అనుమానాలన్నీ శాశ్వతంగా నివృత్తి అవుతాయి.
పిల్లలు, పెద్దలకు ఇలా ఇవ్వండి..
చక్కని పోషకాలు అందించే బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చివి లేదా నానబెట్టిన బాదం ఎలా తిన్నా ఆరోగ్యానికి మంచిదే. ఇది మీకు పచ్చి బాదం రుచి నచ్చితే అలాగే తినండి. ఒకవేళ నానబెట్టిన, పొట్టు తీసిన బాదం నచ్చితే అవే తినండి. కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి అదేమిటంటే.. పిల్లలు లేదా వృద్ధులు పచ్చి బాదం తింటే వారికి అవి ఈజీగా అరగవు. ఎందుకంటే బాదం చాలా గట్టిగా ఉంటాయి కనుక. వీరిలో జీర్ణమయ్యే శక్తి కాస్త తక్కువ కనుక మీరు పిల్లలకు లేదా వృద్ధులకు లేదా రోగులకు బాదం రోజూ ఇస్తుంటేమాత్రం వాటిని నానబెట్టి, పై పొట్టు తీసి తినేందుకు ఇవ్వండి. ఇలా చేస్తే నానబెట్టిన బాదం చాలా ఈజీగా అరుగుతుంది, కడుపునొప్పి రాకుండా చేస్తుంది. వైద్యులు కూడా చెప్పే చిట్కా ఇదే. చాలా సింపుల్ కదా.
బాదంలో ఎన్ని క్యాలరీలున్నాయి?
ఒక కప్పు బాదం పప్పులలో సుమారు 11.5 గ్రాముల కొవ్వు, 5 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. బాదంలో ఉండే కొవ్వు గుండెకు చాల మంచిది, శరీరం అంతటా ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. పీచు పదార్థం (fiber) ఎక్కువగా ఉండి, ఈ విటమిన్ (E vitamin) ఎక్కువగా ఉన్న బాదంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ప్రొటీన్ లు (proteins) ఉంటాయి. ప్రొటీన్ అంటే మీకు ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉండేలా చేస్తుంది. బాదంలోని ప్రొటీన్ మీకు మంచి శక్తిని ఇస్తుంది. అందుకే డైటింగ్ (dieting) చేసేవారు రోజూ గుప్పెడు బాదం తినే అలవాటు పెట్టుకోండి. ఎముకలను దృఢంగా చేసి, బ్లడ్ షుగర్ (blood sugar) ను అదుపులో ఉంచే ఔషధ గుణాలు మెండుగా ఉన్న బాదం అన్ని వయసుల వారికి చాలా మంచిది.
ఎన్ని గంటలు నానాలి?
నానబెట్టిన బాదంపైన ఉన్న పొట్టులో ట్యానిన్ ఉంటుంది. దీంతో పోషకాలు గ్రహించకుండా ఇది అడ్డుపడుతుంది. ఈ ట్యానిన్ (tannin) తీసేయడంతో పోషకాలు సంపూర్ణంగా మన శరీరానికి అందుతాయి. కాబట్టి నానబెట్టి పైపొట్టును తీసేసిన బాదం మరింత మంచిది. 6-7 గంటల పాటు బాదంను నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే బాగా బాదం నాని, మెత్తబడుతుంది. ఇప్పుడు పై పొట్టు తీసే ప్రయత్నం చేయండి చాలా సులువుగా అది ఊడిపోతుంది. ఇలా పొట్టు తీయగానే బాదంను తినేయండి. ఇలా నానబెట్టి, పొట్టు తీసిన బాదం పప్పును మూత పెట్టిన డబ్బాలో నిల్వ ఉంచి, ఓ 4 లేదా 5 రోజులు తినచ్చు. కానీ తాజాగా ఏరోజుకారోజు ఇలా చేసుకోవడం మాత్రమే మంచిది. నానబెట్టిన బాదంతో మన ఒంట్లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోతుంది. దీంతో గుండె పనితీరులో మెరుగుదల వస్తుంది. దీంతో ఏజింగ్ బాగా తగ్గుతుంది, కడుపులో మంటలకు కూడా ఇది విరుగుడుగా పనిచేస్తుంది. నానిన బాదంలో బీ17 విటమిన్ (B17 vitamin) ఉంటుంది. ఇది క్యాన్సర్ పేషంట్లపై అద్భుతంగా పనిచేస్తుంది. నానిన బాదంలో ఉండే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ ట్యూమర్ ను పెరగనివ్వవు.
ఎడాపెడా తినేస్తున్నారు
చాలా మంది బాదంతో ఆరోగ్యం వస్తుందని గుర్తుకవచ్చినప్పుడల్లా గిన్నెలకొద్దీ బాదం లాగించేస్తారు. అలా చేస్తే ఆరోగ్యం తరువాత కానీ కెలరీలు ఓవర్ లోడ్ అయి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అందుకే రోజూ మీ గుప్పెట్లో ఎన్ని బాదం పడతాయి 5-6 కదా, అన్ని బాదం మాత్రమే చాలు, మీ ఒంటికి ఈ పరిమాణం సరిగ్గా సరిపోతుంది. ఇక స్నాక్స్ గా బాదం తినాలనుకునేవారు కూడా గుప్పెడు బాదం తినాలి కానీ రుచిగా ఉన్నాయి కదా అని అలాగే తింటూ కూర్చోకండి. మరోవైపు బాదం వేసిన ఐస్ క్రీం, స్వీట్స్, కూరలు తినేవారు రోజూ తాము తింటున్న ఆహారంలో ఇతర రూపంలో ఉన్న బాదంను కూడా లెక్కలోకి తీసుకోండి. ఇటీవలి కాలంలో యూరోపియన్ స్టైల్ లో ఏం వండినా బాదంతో గార్నిష్ చేయటాన్ని స్టైల్ గా, స్టేటస్ సింబల్ గా తీసుకుంటున్నవారంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, మీరు గార్నిష్ చేసిన బాదంను కూడా మీరు తింటున్నారు కనుక బాదం అతిగా తినకుండా మితంగా తినేలా జాగ్రత్తలు తీసుకోండి.
Comments