top of page

APSSDC Jobs: ఏపీలో డిగ్రీ, డిప్లొమో చేసిన వారికి శుభవార్త.. ఆ కంపెనీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

  • Writer: Raju Shaik
    Raju Shaik
  • Jan 1, 2021
  • 1 min read

Jobs in AP: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో మరో కంపెనీలో ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదలైంది. విశాఖపట్నంలోని ఐడీఏ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (IDA AUTOMATION PVT LTD) కంపెనీలో ఖాళీలను భర్తీ చేసేందుకు APSSDC ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరో కంపెనీలో ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదలైంది. విశాఖపట్నంలోని ఐడీఏ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (IDA AUTOMATION PVT LTD) కంపెనీలో ఖాళీలను భర్తీ చేసేందుకు APSSDC ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.12082 వరకు వేతనం చెల్లించనున్నారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 7ను గడువుగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కోన్నారు.


విద్యార్హతల వివరాలు:

డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, లేదా డిప్లొమో చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు 2017-20 మధ్యలో పాసైన వారై ఉండాలి. పురుషులు, స్త్రీలు ఎవరైన అప్లై చేయవచ్చు. వయస్సు 18-26 ఏళ్ల మధ్య ఉండాలి. టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్ల ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు వైజాగ్ లోని కంపెనీ కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు, సందేహాల నివృత్తికి 9959377669 నంబరును సంప్రదించవచ్చు.

ఎంపిక ఇలా..

-అభ్యర్థులు మొదట APSSDC పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

-జిల్లా స్కిల్ డవలప్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

-విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు IDA AUTOMATION PVT LTD కంపెనీలో ఉద్యోగం కల్పించబడుతుంది.

-శిక్షణ పూర్తి చేసకున్న అభ్యర్థులకు APSSDC ఆధ్వర్యంలో సర్టిఫికేట్ అందిస్తారు.


Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Instagram
  • Pinterest

©2020 by a2z News99

bottom of page