Indian Air Force Jobs 2021: ఇంటర్ పాసైనవారికి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు
- Raju Shaik
- Jan 1, 2021
- 1 min read
Indian Air Force Jobs 2021 | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. ఓ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-AFCAT 2021 నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ గడువు గతంలోనే ముగిసింది. కానీ ఇంకా దరఖాస్తు చేయనివారికి మరో అవకాశం ఇస్తూ అప్లికేషన్ డెడ్‌లైన్ పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జనవరి 11 వరకు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.careerindianairforce.cdac.in/ లేదా https://afcat.cdac.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. ఫ్లైయింగ్‌తో పాటు అడ్మిన్, లాజిస్టిక్స్, అకౌంట్స్ లాంటి నాన్ బ్రాంచ్‌లల్లో గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF. మొత్తం 235 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు 2021 జనవరి 18 నుంచి 21 వరకు అప్లికేషన్ ఫామ్ మాడిఫై చేయొచ్చు. ఎంపికైనవారికి హైదరాబాద్‌లోని దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఇస్తుంది ఐఏఎఫ్. 2022 జనవరిలో కోర్సు మొదలవుతుంది.
IAF AFCAT 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 11
AFCAT 2021 అడ్మిట్ కార్డుల విడుదల- 2021 ఫిబ్రవరి 5
AFCAT 2021 ఎగ్జామ్- 2021 ఫిబ్రవరి 20, 21
కోర్సు ప్రారంభం- 2022 జనవరి
IAF AFCAT 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
మొత్తం ఖాళీలు- 235
ఫ్లయింగ్- 69
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్- 96
గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్- 70
విద్యార్హత- అడ్మినిస్ట్రేషన్ పోస్టులకు ఇంటర్ లేదా డిగ్రీ పాస్ కావాలి. అకౌంట్స్ పోస్టులకు బీకామ్ పాస్ కావాలి. లాజిస్టిక్స్ పోస్టులకు డిగ్రీ పాస్ కావాలి. విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
దరఖాస్తు ఫీజు- రూ.250
Comments