APSSDC Jobs: టెన్త్ అర్హతతో Flipkartలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి
- Raju Shaik
- Jan 4, 2021
- 1 min read
Jobs in AP: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టింది. ఈ మేరకు సంస్థ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్ ఉద్యోగాల భర్తీకి APSSDC నియామకాలు చేపట్టింది. ఈ మేరకు సంస్థ ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటన ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. అనుభవం ఉన్న వారు, ఫ్రెషర్లు ఇద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు.
18-30 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారికి డ్రైవింగ్ లైసెన్స్/LLR, స్మార్ట్ ఫోన్ తో పాటు టూ వీలర్ వాహనం ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో పని చేయాల్సి ఉంటుంది. దీంతో స్థానిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
విద్యార్హతను టెన్త్ గా నిర్ణయించారు. జనవరి 4 ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. https://docs.google.com/forms/d/e/1FAIpQLScVYE1SECbqmuaWVbmj0ReCAYjbm7xeuIV69tIVwxRhjLxc6w/viewform
Comments