Breaking news: యూజర్లకు షాక్... ప్రపంచవ్యాప్తంగా Google, Gmail, YouTube డౌన్
- Raju Shaik
- Dec 14, 2020
- 1 min read
Google Down | గూగుల్ యూజర్లకు షాక్. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. గూగుల్ సేవలు సరిగ్గా పనిచేయట్లేదని సోషల్ మీడియాలో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1. సరిగ్గా నెలరోజుల క్రితం ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో యూట్యూబ్ సేవల్లో అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఓ గంటపాటు యూట్యూబ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన యూట్యూబ్ ఈ సమస్యను పరిష్కరించింది. (ప్రతీకాత్మక చిత్రం)

2. ఇప్పుడు యూట్యూబ్‌తో పాటు గూగుల్‌కు చెందిన ఇతర సేవలు అయిన జీమెయిల్, గూగుల్ వర్క్ స్పేస్, సెర్చ్ ఇంజిన్‌లో ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ విషయాన్ని డౌన్‌డిటెక్టర్ కూడా ధృవీకరించింది. జీమెయిల్, యూట్యూబ్ సేవల్లో సమస్యలు వస్తున్నాయని, సరిగ్గా పనిచేయట్లేదని వేలాది మంది యూజర్లు ఇప్పటికే కంప్లైంట్ చేశారు.

4. గూగుల్‌కు చెందిన గూగుల్ ప్లే, గూగుల్ మీట్, గూగుల్ క్లాస్‌రూమ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ హ్యాంగౌట్స్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ డాక్స్, యూట్యూబ్‌లో ఈ సమస్యలు వచ్చాయి. పలువురు యూజర్లు ట్విట్టర్‌లో కూడా ఈ విషయాన్ని పంచుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.10 గంటల నుంచి ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలపై ఇప్పటికే యూట్యూబ్ స్పందించింది. వేలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, తమ టీమ్ ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తోందని యూట్యూబ్ ప్రకటించింది.
6. అమెరికా, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, జపాన్ లాంటి ప్రాంతాల నుంచి డౌన్ డిటెక్టర్స్‌కు గూగుల్ సేవల్లో అంతరాయం గురించి సమాచారం అందుకోంది.
Comentarios