Cheque Payment: ఎవరికైనా చెక్ ఇస్తున్నారా? రేపటి నుంచి ఈ కొత్త రూల్
- Raju Shaik
- Dec 31, 2020
- 2 min read
Cheque Payments | చెక్ ద్వారా పేమెంట్స్ చేసే అలవాటు మీకు ఉందా? మీరు ఎక్కువగా చెక్స్ ఉపయోగిస్తుంటారా? అయితే 2021 జనవరి 1న కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ రూల్‌తో మీకు లాభమేంటో తెలుసుకోండి.

1. మీరు పేమెంట్స్ కోసం ఎవరికైనా చెక్ ఇస్తున్నారా? తరచూ జరిగే చెక్ మోసాలు చూసి భయపడుతున్నారా? చెక్ మోసాలు అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. 'పాజిటీవ్ పే' పద్ధతిని 2021 జనవరి 1 నుంచి అమలు చేయనుంది.

2. చెక్కు మోసాలు అనేకం చూస్తుంటాం. ఉదాహరణకు ఓ వ్యక్తి మరొకరికి రూ.100000 చెక్ ఇచ్చారనుకుందాం. చెక్ తీసుకున్న వ్యక్తి దాన్ని ఫోర్జరీ చేసే అవకాశం ఉంది. రూ.100000 నెంబర్‌ను కాస్తా రూ.2100000 అని ఈజీగా మార్చేయొచ్చు. ఇంగ్లీష్‌లో One Lakh అని రాసినా పక్కన Twenty అని రాసి రూ.21,00,000 డ్రా చేసే అవకాశముంది.
3. ఇలాంటి చెక్కు మోసాలు మనం అనేకం చూస్తుంటాం. అందుకే రూ.50,000 మించి పేమెంట్స్ చేసే అన్ని చెక్కులకు 'పాజిటీవ్ పే' అనే పద్ధతిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెడుతోంది. 2021 జనవరి 1న ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ విధానం అమలులోకి వచ్చిందంటే చెక్కు మోసాలకు అడ్డుకట్ట పడ్డట్టే.

4. 'పాజిటీవ్ పే' పద్ధతి ద్వారా చెక్కు మోసాలు దాదాపుగా ఉండవు. ఉదాహరణకు రూ.100000 పేమెంట్ కోసం మీరు ఓ వ్యక్తికి చెక్ ఇచ్చారనుకుందాం. మీరు ఇచ్చిన చెక్‌ను ఫోటో తీసుకొని మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ చెక్ వివరాలను మీ బ్యాంకు మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
5. సదరు వ్యక్తి ఆ చెక్ డ్రా చేసుకోవడానికి వెళ్లినప్పుడు మీరు యాప్ ద్వారా అప్‌లోడ్ చేసిన వివరాలతో మ్యాచ్ చేసి చూస్తారు బ్యాంకు సిబ్బంది. యాప్‌లో, చెక్‌లో మీరు ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉంటే పేమెంట్ పూర్తవుతుంది. లేదంటే ఆ చెక్‌ను బ్యాంకు తిరస్కరిస్తుంది. ఆ సమాచారాన్ని మీకు అందిస్తుంది.
6. చెక్ వివరాలు రీ-ఎగ్జామినేషన్ చేయాలని మీకు సూచిస్తుంది. అందే మీరు ఇచ్చిన చెక్ క్లియరెన్స్‌కు వెళ్లగానే మీకు తెలుస్తుందన్నమాట. మీరు అప్‌లోడ్ చేసిన సమాచారాన్ని సరిచూసుకోకుండా చెక్ క్లియర్ చేసే అవకాశం ఉండదు. దీని వల్ల చెక్ మోసాలకు అడ్డుకట్ట పడ్డట్టే.
7. ఇప్పటికే చెక్కు మోసాలను అడ్డుకోవడానికి ఐసీఐసీఐ బ్యాంకు ఇలాంటి పద్ధతే పాటిస్తోంది. 2019 మే నుంచి తమ కస్టమర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్ ఎవరికైనా చెక్ ఇవ్వగానే ఆ వివరాలను బ్యాంకు మొబైల్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేస్తారు.
8. అందులో చెక్ నెంబర్, తేదీ, ఏ వ్యక్తి పేరుతో చెక్ ఇచ్చారు, అకౌంట్ నెంబర్, అమౌంట్ లాంటి వివరాలను ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్ వివరించాలి. అంతేకాదు... చెక్ ముందు, వెనుక ఫోటోలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఆ వివరాలను సరిచూసుకున్న తర్వాతే చెక్ క్లియర్ చేస్తుంది ఐసీఐసీఐ బ్యాంకు. ఇప్పుడు ఇదే విధానం పాజిటీవ్ పే మెకానిజం పేరుతో ఇతర బ్యాంకులకు కూడా రానుంది.
Comments