Ghost: రోడ్డుపై నడుస్తూ వెళ్లిన దెయ్యం?.. CCTV ఫుటేజ్ వీడియో వైరల్
- Raju Shaik
- Dec 14, 2020
- 2 min read
Ghost: మనందరికీ దెయ్యం అనేది ఎలా ఉంటుందో చూడాలని ఉంటుంది. కానీ అసలు దెయ్యాలు ఉన్నాయా లేదా అన్నదే ఓ మిస్టరీ ప్రశ్న. తాజా వీడియోలో ఆకారాన్ని మీరే కళ్లారా చూడండి.

Viral CCTV Footage: ఆ వీడియోని మీకు చూపిస్తూ... అందులో దెయ్యం ఉంది అని చెప్పక పోతే... అందులోని రోడ్డుపై ఎవరో వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడనీ, ఆ వ్యక్తిని వాహనం ఢీ కొట్టిందని మీరు అనుకుంటారు. తద్వారా అదో రోడ్డు ప్రమాదంలా మీరు భావిస్తారు. కానీ... ఢీకొట్టిన వాహనం ఆగదు. మరో వాహనం కూడా ఢీ కొడుతుంది. అది కూడా ఆగదు. రెండు వాహనాలు ఢీకొట్టినా... అందులో వ్యక్తి ఏమాత్రం తడబడకుండా అలా రోడ్డు దాటుతూ వెళ్తుంటాడు. నిజంగా అతడు వ్యక్తే అయితే... అలా జరగడం అసాధ్యం. కానీ అది దెయ్యం కాబట్టే సాధ్యమైందనే ప్రచారం జోరందుకుంది. అంతే ఆ వీడియో వైరల్ అయిపోయింది. అందులో చిత్రమైన మనిషి లాంటి నీడ రోడ్డుపై నడుస్తూ... వాహనాలు అడ్డు వస్తున్నా బెదరకుండా వెళ్లిన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇది ఫిలిప్పీన్స్ లోని పంగాసినాన్ నగరంలో దృశ్యం. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. జనరల్‌గా హేతువాదులు దెయ్యాలు ఉన్నాయంటే నమ్మరు. అందువల్ల వాళ్లు ఈ వీడియోని చూస్తే... అందులో ఆకారం ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. దెయ్యాలు ఉన్నాయని అని నమ్మేవారు మాత్రం... "అదిగో.. అది దెయ్యమే... ఇప్పటికైనా హేతువాదులు దెయ్యాలు ఉన్నాయని నమ్మండి" అంటున్నారు. ఓ కిరాణా షాపు ముందు ఈ చిత్రమైన నీడ అలా వెళ్తూ కనిపించింది. షాకింగ్ విషయమేంటంటే... వాహనాలలోపలి నుంచి కూడా ఈ నీడ వెళ్లిపోయినట్లు ఫుటేజ్‌లో కనిపిస్తోంది.
సన్స్ రిపోర్ట్ ప్రకారం... ఈ వీడియో బయటకు వచ్చాక... స్థానికులు చాలా భయపడుతున్నారట. ఓ ఎల్ లారీ, రెండు కార్లు, ఓ బైక్ ని దాటి ఆ నీడ రోడ్డు దాటి వెళ్లింది. రోడ్డుపై వెళ్తున్న ఎవరికీ అది కనిపించనట్లే ఉంది. షాపు ఓనర్ సీసీ టీవీ ఫుటేజ్ లో ఇది కనిపించింది. ఇదో రకమైన దెయ్యం అంటున్నారు. ఇది ఇప్పుడు తీసింది కాదట. ఎప్పుడో జూన్ నాటి ఫుటేజ్ అట. కాకపోతే... ఇన్నాళ్లూ ఎవరికీ చెప్పకుండా తన దగ్గరే దాచుకున్నాడు. మొత్తానికి ఇప్పుడు బయటపెట్టాడు.
దెయ్యాలు సినిమాల్లో చూపించినట్లు ఉంటాయనుకుంటే... ఈ దెయ్యం అచ్చం మనిషి నీడలా ఉంది. రోడ్డుపై నడుస్తున్నప్పుడు కాళ్లు అటూ ఇటూ కదులుతూ కనిపించాయి కూడా. పైగా... ఓ డెలివరీ బాయ్‌కి చాలా దగ్గర నుంచి ఈ దెయ్యం వెళ్లిందంటున్నారు. ఆ డెలివరీ బాయ్‌ని కనిపెట్టారు. అతని పేరు మైకెల్ ఫోర్టో. ఈ వీడియో చూసినప్పటి నుంచి అతను భయం భయంగా ఉంటున్నాడు.
"ఇప్పటికీ నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. నేను టీవీల్లోనే దెయ్యాలను చూశాను. షాప్ కీపర్ జెన్నీ రెనాల్టో కూడా ఇక్కడ పని చెయ్యాలంటే భయమేస్తోందని చెబుతున్నారు. ఇటుగా వెళ్లిన ప్రతిసారీ ఎవో తనను చూస్తున్నట్లు అనిపిస్తోందని అంటున్నారు" అని మైకెల్ వివరించాడు.
ఈ వీడియోలో ఉన్నది దెయ్యమే అని సరిపెట్టేసుకుంటే... సమస్యే ఉండదు. అది దెయ్యం కాదు అని అనుకుంటే... మరేంటన్న ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంటుంది. ఇప్పుడు హేతువాదులు అదే పనిలో ఉన్నారు. ఆ నీడ వీడియోలోనిదేనా లేక... కెమెరా అద్దంపై వేరే ఎవరైనా నడిచి వెళ్లేది రిఫ్లెక్ట్ అయ్యిందా అనే డౌట్ వస్తోంది వారికి.
Comments