Indian Army Jobs 2021: డిగ్రీ పాసైనవారికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు
- Raju Shaik
- Jan 8, 2021
- 1 min read
Indian Army NCC Special Entry Recruitment 2021 | డిగ్రీ పాసయ్యారా? ఎన్‌సీసీ సర్వీస్ చేశారా? ఇండియన్ ఆర్మీ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఈరోజే ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

1. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. ఇండియన్ ఆర్మీ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 49వ కోర్స్ (ఏప్రిల్ 2021) ప్రకటించింది. పెళ్లి కాని యువతీ యువకుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 55 ఖాళీలు ఉన్నాయి. నేషనల్ క్యాడెట్ కార్ప్స్-NCC విద్యార్థులకే ఈ అవకాశం.

2. ఈ పోస్టులకు 2021 జనవరి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
3. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఎంపికైన వారికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ ఉంటుంది.
4. మొత్తం 55 ఖాళీలు ఉండగా అందులో ఎన్‌సీసీ మెన్- 50 (జనరల్ కేటగిరీ-45, వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్-5), ఎన్‌సీసీ వుమెన్- 5 (జనరల్ కేటగిరీ-4, వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్-1) పోస్టులున్నాయి.
5. విద్యార్హతల వివరాలు చూస్తే ఏదైనా డిగ్రీ కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
6. ఇక ఎన్‌సీసీ సర్వీస్ వివరాలు చూస్తే ఎన్‌సీసీలో కనీసం మూడేళ్లు సీనియర్ డివిజన్, సీనియర్ వింగ్‌లో పనిచేసి ఉండాలి. ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ ఎగ్జామ్‌లో బీ గ్రేడ్‌లో పాస్ కావాలి. ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ లేనివాళ్లు దరఖాస్తు చేయకూడదు.
7. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ‘Officer Entry Appln/Login’ పైన క్లిక్ చేసి ఆ తర్వాత ‘Registration’ పైన క్లిక్ చేయాలి.
8. పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ‘Apply Online’ పైన క్లిక్ చేయాలి. అందులో ‘Apply’ పైన క్లిక్ చేయాలి. వ్యక్తిగత వివరాలు, కమ్యూనికేషన్ డీటెయిల్స్‌తో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి. చివరగా వివరాలన్నీ ఓసారి సరిచూసుకొని దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
Comments