top of page

KGF Chapter 2: కేజీఎఫ్ 2 బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది

  • Writer: Raju Shaik
    Raju Shaik
  • Dec 21, 2020
  • 1 min read

కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా అప్డేట్స్ కోసం.. యావత్తు సినీ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం అలాంటి ప్రభంజనం సృష్టించి సినీ ఇండస్ట్రీలోని గత రికార్డులను తిరగరాసింది.

KGF 2 teaser release date announce: కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా అప్డేట్స్ కోసం.. యావత్తు సినీ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం అలాంటి ప్రభంజనం సృష్టించి సినీ ఇండస్ట్రీలోని గత రికార్డులను తిరగరాసింది. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు కేజీఎఫ్ 2 సర్‌ప్రైజ్ ఉంటుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సర్‌ప్రైజ్‌ను మూవీ మేకర్స్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.


కొత్తసంవత్సరం జనవరి 8న ఏకంగా ఈ సినిమా టీజర్‌నే విడుదల చేసి ప్రభంజనం సృష్టించనున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) ట్విట్ చేశారు. కేజీఎఫ్ ఛాప్టర్ 2 (KGF Chapter 2) టీజర్‌ను జనవరి 8న ఉదయం 10.18 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిన్నటితో ముగిసింది.

తాజాగా యశ్ (Yash) సంజయ్ దత్ (Sanjay Dutt ) మీద క్లైమాక్స్ సన్నివేశాలను పూర్తిచేశారు. వీరితోపాటు ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు రవీనా టాండన్ (Raveena Tandon) , శ్రీనిధి శెట్టి ( Srinidhi Shetty ) తదితరులు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా ఈ సినిమా టీజర్ ( KGF 2 teaser ) విడుదల చేస్తామని మూవీ మేకర్స్ వెల్లడించడంతో.. కేజీఎఫ్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Instagram
  • Pinterest

©2020 by a2z News99

bottom of page