LPG Gas Cylinder: ఉచితంగా గ్యాస్ సిలిండర్... ఈ ఒక్క రోజే ఛాన్స్
- Raju Shaik
- Dec 31, 2020
- 1 min read
LPG Gas Cylinder | పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే దాదాపు ఉచితంగానే సిలిండర్ పొందొచ్చు. ఈ ఆఫర్ ఈరోజే ముగుస్తుంది. ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

1. గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే వేర్వేరు పద్ధతులు ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి సిలిండర్ బుక్ చేయొచ్చు. ఆయిల్ కంపెనీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో బుకింగ్ చేయొచ్చు. లేదా ఐవీఆర్ఎస్ నెంబర్‌కి కాల్ చేసినా గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది.

2. గ్యాస్ సిలిండర్‌ను థర్డ్ పార్టీ యాప్స్‌లో కూడా బుక్ చేయొచ్చు. ఇప్పటికే పేటీఎంలో Book a Cylinder పేరుతో సిలిండర్ బుకింగ్ సర్వీస్ అందిస్తోంది. మీరు ఇప్పటి వరకు పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేయనట్టైతే ఒక సిలిండర్ ఉచితంగా పొందొచ్చు.
3. పేటీఎంలో మొదటిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.500 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశముంది. ఇందుకోసం యూజర్లు FIRSTLPG ప్రోమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రోమో కోడ్‌తో సిలిండర్ బుక్ చేస్తే మీకు రూ.500 వరకు క్యాష్ బ్యాక్ రావొచ్చు.
4. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.700 పైన ఉంది. మీరు ఇదే సిలిండర్ పేటీఎంలో బుక్ చేస్తే రూ.500 వరకు క్యాష్ బ్యాక్ రావొచ్చు.
5. ఒకవేళ మీకు పేటీఎంలో రూ.500 క్యాష్ బ్యాక్ వస్తే సిలిండర్‌కు మీరు చెల్లించే ధర రూ.200 మాత్రమే. అయితే ప్రభుత్వం నుంచి సిలిండర్‌కు సబ్సిడీ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ సబ్సిడీ రూ.200 వరకు ఉంటుంది. అంటే ఈ లెక్కన పేటీఎంలో బుక్ చేయడం ద్వారా మీరు ఒక సిలిండర్ ఉచితంగా పొందే అవకాశముంది.

6. పేటీఎంలో మీరు భారత్ గ్యాస్, ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ సిలిండర్లను బుక్ చేయొచ్చు. మీరు Book a Cylinder పైన క్లిక్ చేసిన తర్వాత గ్యాస్ ప్రొవైడర్ పేరు సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఎల్‌పీజీ ఐడీ లేదా కస్టమర్ నెంబర్ ఎంటర్ చేసి Proceed పైన క్లిక్ చేయాలి.
7. ఓ వివరాలు సరిచూసుకున్న తర్వాత పేమెంట్ పూర్తి చేయాలి. మొదటిసారి సిలిండర్ బుక్ చేస్తున్నట్టైతే రూ.500 వరకు క్యాష్ బ్యాక్ పొందేందుకు FIRSTLPG ప్రోమో కోడ్ ఉపయోగించాలి. ఒక కస్టమర్ ఒక్కసారి మాత్రమే ఈ ప్రోమో కోడ్ ఉపయోగించొచ్చు.
8. మొదటి సిలిండర్‌పై రూ.500 వరకు క్యాష్ బ్యాక్ పొందేందుకు 2020 డిసెంబర్ 31 వరకే అవకాశముంది. ఆ తర్వాత ఈ ఆఫర్ వర్తించదు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేముందు పేటీఎంలో ఓసారి నియమనిబంధనలు చదవాలి.
Comments