Mi Fan Sale: కొత్త సేల్ తో ముందుకొచ్చిన షియోమి.. ఆ ఫోన్లపై రూ. 4 వేల వరకు డిస్కౌంట్
- Raju Shaik
- Dec 18, 2020
- 2 min read
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమి(Xiaomi) మరో భారీ సేల్ తో ముందుకొచ్చింది. తన ఆన్లైన్ ప్లాట్ ఫాం ఎంఐ డాట్ కామ్ ద్వారా ‘ నెంబర్ 1 ఎంఐ ఫ్యాన్ సేల్’(No.1 Mi Fan Sale )ను నిర్వహిస్తోంది. ఈ సేల్లో భాగంగా ఎయిర్ ప్యూరిఫైయర్, స్మార్ట్‌వాచ్, బ్యాక్‌ప్యాక్, స్మార్ట్‌ఫోన్తో పాటు అనేక ఉత్పత్తులపై రూ. 4,000 డిస్కౌంట్ ను అందిస్తోంది.

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమి(Xiaomi) మరో భారీ సేల్ తో ముందుకొచ్చింది. తన ఆన్లైన్ ప్లాట్ ఫాం ఎంఐ డాట్ కామ్ ద్వారా ‘ నెంబర్ 1 ఎంఐ ఫ్యాన్ సేల్’(No.1 Mi Fan Sale )ను నిర్వహిస్తోంది. ఈ సేల్లో భాగంగా ఎయిర్ ప్యూరిఫైయర్, స్మార్ట్‌వాచ్, బ్యాక్‌ప్యాక్, స్మార్ట్‌ఫోన్ తో పాటు అనేక ఉత్పత్తులపై రూ. 4,000 డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ సేల్లో భాగంగా రెడ్‌మి నోట్ 9ప్రో (Redmi Note 9 Pro) స్మార్ట్ఫోన్పై రూ.1,000 డిస్కౌంట్ ను ప్రకటించింది. రూ .13,999 ధర ఉన్న Redmi Note 9 Pro (4GB RAM + 64GB) వేరియంట్ ను డిస్కౌంట్ కింద రూ .12,999లకే కొనుగోలు చేయవచ్చు. షియోమి నిర్వహిస్తున్న ‘నెంబర్ 1 ఎంఐ ఫ్యాన్ సేల్’లో Mi Notebook 14 Horizon Editionపై రూ .4,000 డిస్కౌంట్ ను అందించనుంది. రూ .54,999గా ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ను ఆఫర్ కింద రూ .50,999 లకే కొనుగోలు చేయవచ్చు.
దీనితో పాటు తన Mi Watch Revolveపై కూడా డిస్కౌంట్ ను ప్రకటించింది. గతంలో రూ .10,999గా ఉన్న ఈ వాచ్ ను సేల్లో భాగంగా రూ .9,999లకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫిట్‌నెస్ వాచ్‌లో 10 స్పోర్ట్స్ మోడ్‌లు, స్ట్రెస్ మేనేజ్మెంట్, హృదయ స్పందన రేటు పర్యవేక్షణ, హెచ్‌ఆర్ పర్యవేక్షణ, బాడీ ఎనర్జీ పర్యవేక్షణ, GPS సపోర్ట్, 1.39 -అంగుళాల AMOLED డిస్‌ప్లే, ఉత్తమ బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లను అందించింది.
ఎంఐ నోట్ బుక్ 14 హారిజన్ ఎడిషన్ పై రూ.4000 డిస్కౌంట్..
కాగా, ప్రస్తుతం రూ.1,999లకు లభిస్తున్న 10,000mAh ఎంఐ వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌పై రూ.500 తగ్గింపును అందిస్తోంది. ఈ పవర్ బ్యాంక్ 10W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్కు సపోర్ట్ ఇస్తుంది. అంతేకాక, రూ .11,999గా ఉన్న ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్‌ను రూ .10,999లకే కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు రూ .6,499గా ఉన్న ‘Xiaomi Air Purifier 2C’ని రూ .5,999 లకు కొనుగోలు చేయవచ్చు.
ఇది డ్యూయల్ ఫిల్ట్రేషన్ టెక్నాలజీతో తయారైంది. ఎంఐ ఫ్యాన్ సేల్లో Mi Business Casual Backpack ని కూడా అమ్మకానికి ఉంచింది. రూ .999గా ఉన్న క్యాజువల్ బ్యాక్ప్యాక్ను రూ.899లకే కొనుగోలు చేయవచ్చు. పదివేల లోపు అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ కొనాలి అనుకునే వారికి రెడ్‌మి 9 ప్రైమ్ బెస్ట్ ఛాయిస్. ఎంఐ ఫ్యాన్సేల్లో భాగంగా ఈ పరికరాన్ని రూ .9,999 లకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 5,020mAh బ్యాటరీ, మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్, 6.53 -అంగుళాల FHD+ డిస్‌ప్లే వంటి ఫీచర్లను జోడించింది.
Comentarios