Pawan Kalyan-Rana Daggubati : పవన్ కళ్యాణ్ మలయాళ రీమేక్లో రానా.. అధికారిక ప్రకటన..
- Raju Shaik
- Dec 21, 2020
- 2 min read
Pawan Kalyan-Rana Daggubati : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయినా అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు ఓకే చెప్పుతున్నాడు. ఆయన ఇప్పటికే ‘వకీల్ సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా హిందీ సినిమా పింక్‌కు రీమేక్ గా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఇంకొన్ని రోజుల్లో మొత్తం షూటింగ్ ముగియనుంది. ఈ సినిమా తర్వాత ఆయన మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట. ఈ సినిమాలో పవన్‌తో పాటు మరో కీలక పాత్రలో రానా నటిస్తున్నాడని టాక్ నడిచిన సంగతి తెలిసిందే. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటన విడుదలైంది.
మలయాళంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా అయితే బాగుంటుందని భావించిన చిత్రబృందం.. రానాను ఆ క్యారెక్టర్ కోసం చిత్రబృంద సంప్రదించిదట. ఆ పాత్రకు రానాకు కూడా నచ్చడంతో.. నటించడానికి రానా ఒకే చెప్పాడట. ఇక ఈ సినిమాలో రానా సరసన నివేధా నటించే అవకాశం ఉందట. నివేదా.. మెంటల్ మది'లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన అందాల నటి. ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన భాగానే రోమన్స్ చేసింది. సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు తెలుగులో ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. అయితే ఆ మధ్య వచ్చిన సాయి ధరమ్ తేజ్ 'చిత్ర లహరి'లో మరో తెలుగు సినిమా 'బ్రోచేవారేవరురా..' లో కూడా నటించి అదరగొట్టింది. ఇక నివేథా.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములోలో అల్లు అర్జున్ మరదలి పాత్రలో హాట్‌గా కనిపించి అదరగొట్టిన సంగతి తెలిసిందే.
ఇక పవన్ పక్కన సాయిపల్లవి నటించనుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక పవన్ నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఎన్నికలకు సమయం ఉన్నందున.. పవన్ ఆ ఖాలీ సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తున్నాడు. అందులో భాగంగా ఆయన హిందీలో సూపర్ హిట్ అయినా పింక్ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమాతో పాటు పవన్ మరో రెండు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఒకటి. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అప్పీల్ కావడంతో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం. విరూపాక్ష అనే పేరును పరిశీలిస్తోంది చిత్రబృందం. ఈ సినిమాతో పాటు పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నాడు.
Comments