Prabhas Adipurush: ప్రభాస్ 'ఆదిపురుష్' టీమ్‌కి షాక్.. ఆ ఇద్దరిపై కేసు నమోదు
- Raju Shaik
- Dec 16, 2020
- 1 min read
రెబల్‌స్టార్ ప్రభాస్(Prabhas) నటించనున్న మరో భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్(Adipurush). రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓమ్ రౌత్(Om Raut) తెరకెక్కిస్తున్నారు

రెబల్‌స్టార్ ప్రభాస్ నటించనున్న మరో భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓమ్ రౌత్ తెరకెక్కిస్తున్నారు. టిసిరీస్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 3డీ తెరకెక్కబోయే ఈ మూవీకి హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు. ఇక ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ క్రమంలో ఆదిపురుష్ కోసం ప్రభాస్ వర్కౌట్లు కూడా ప్రారంభించేశారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ యూనిట్‌కి ఇప్పుడో ఓ షాక్ తగిలింది. ఈ మూవీ దర్శకుడు ఓమ్ రౌత్‌తో పాటు ఇందులో రావణ్ పాత్రలో నటించనున్న సైఫ్ అలీ ఖాన్‌పై కేసు నమోదైంది. ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడిన సైఫ్ అలీ ఖాన్.. ఆదిపురుష్‌లో రావణుడిని మంచివాడిగా చూపిస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై వివాదం చెలరేగడంతో సైఫ్ మళ్లీ తన మాటలను వెనక్కి తీసుకున్నారు.
అయితే సైఫ్ మాటలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హిమాన్షు శ్రీవాస్తవ అనే అడ్వకేట్ ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను సనాతన ధర్మాన్ని నమ్ముతానని.. రాముడు అంటే మంచి వాడు, రావణుడు అంటే చెడ్డవాడని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సైఫ్ చేసిన వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని కించపరిచినట్లు ఉన్నాయని అందులో వివరించారు. ఇక ఈ పిటిషన్‌ని విచారించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కాగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఆదిపురుష్‌లో సీతగా కృతి సనన్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.
Comentários