Railway Jobs: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి అలర్ట్... ఇవి గుర్తుంచుకోండి
- Raju Shaik
- Feb 8, 2021
- 1 min read
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి అలర్ట్. రైల్వే ఉద్యోగానికి దరఖాస్తు చేసినా, చేయాలనుకున్నా ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

1. రైల్వేలో ఉద్యోగం మీ కలా? రైల్వే ఉద్యోగానికి దరఖాస్తు చేశారా? రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB జారీ చేసే నోటిఫికేషన్లకు సిద్ధమవుతున్నారా? అయితే జాగ్రత్త అంటోంది దక్షిణ మధ్య రైల్వే.
2. ఆర్ఆర్‌బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC, మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ లాంటి నోటిఫికేషన్ల ద్వారా వేలాది పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్‌టీపీసీ ఉద్యోగాలకు పరీక్షలు జరుగుతున్నాయి.
3. కొంతకాలంగా రైల్వే ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్నాయి. ఇటీవల ఇలాంటి మోసాలు తమ దృష్టికి వచ్చాయని, రైల్వేలో ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
4. భారతీయ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC లేదా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నిర్వహించే పరీక్షలు పాస్ అయిన వారికి మాత్రమే రైల్వేలో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులను అప్రమత్తం చేస్తోంది.
5. రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC లేదా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నోటిఫికేషన్లు జారీ చేసే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసి, పరీక్ష రాసి, అందులో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అంతే తప్ప బ్రోకర్లు, దళారుల మాటలు నమ్మకూడదు.
6. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామంటే డబ్బులు ఇవ్వకూడదు. రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC లేదా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB, రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లు మాత్రమే ఫాలో కావాలని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది.
7. గతంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. సాధారణంగా రైల్వే ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు బ్రోకర్లు, దళారులు రంగంలోకి దిగుతారని, మోసాలు చేస్తారని హెచ్చరించింది.
8. రైల్వే ఉద్యోగాల భర్తీలో దళారులు, బ్రోకర్ల ప్రమేయం ఏమాత్రం ఉండదు. ఇప్పటికే రైల్వే ఉద్యోగాల పేరుతో మోసాలు జరిగిన ఘటనల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైనా రైల్వేలో జాబ్ ఇప్పిస్తామని, డబ్బులు ఇవ్వాలని అడిగితే స్థానిక పోలీసులకు లేదా రైల్వే అధికారులకు లేదా ఆర్ఆర్‌బీకి ఫిర్యాదు చేయాలి.
Comments