Salt Water Benefits: ఉప్పు నీటితో ఆరోగ్య ప్రయోజనాలు... ఇలా చేస్తే ఎంతో మేలు
- Raju Shaik
- Dec 22, 2020
- 1 min read
Benefits Of Salt Water: సాల్ట్ వాటర్‌తో ఎన్నో ప్రయోజానాలున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. మన జుట్టు, చర్మం, నోరు, శరీరానికి ఉప్పు నీరు ఎంతో మేలు చేస్తుంది. ఐతే... ఉప్పు నీటితో సమస్యలూ ఉన్నాయి. వాటిలో చిక్కుకోకుండా ప్రయోజనాలు ఎలా పొందాలో తెలుసుకుందాం.

స్టాల్ వాటర్ అంటే ఏంటి... సోడియం, క్లోరైడ్ కలిసిన ద్రవం. సోడియం అనేది మనకు అత్యవసరమైన ఖనిజం. ఇది మన శరీరంలో ద్రవాలు సమంగా ఉండేలా చేస్తుంది. కండరాలు, నాడీ వ్యవస్థ చక్కగా పనిచేసేలా చేస్తుంది.

రక్తపోటు (బీపీ), రక్త ప్రవాహం కంట్రోల్‍లో ఉండాలంటే... సోడియం కావాలి. సాల్ట్ ఎక్కువగా వాడితే... హైబీపీ వచ్చేస్తుంది. గుండె జబ్బులూ తప్పవు. సాల్ట్ వల్ల మన పొట్ట, పేగులు, పెద్ద పేగు వంటివి క్లీన్ అవుతాయి. అలాగని ఉప్పు ఎక్కువైతే... అది ప్రమాదకరం కూడా.

ఎండల్లో తిరిగేవాళ్లు డీహైడ్రేట్ అయిపోతారు. వారిలో శరీరంలో ఉప్పు చెమట, ఇతర మార్గాల్లో బయటకు వచ్చేస్తుంది. అలాంటి వాళ్లు గ్లాస్ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగాలి. నిమ్మకాయ రసం కలుపుకొని సాల్ట్ వాటర్ తాగినా మంచిదే. తిరిగి బాడీలో హైడ్రేటింగ్ వస్తుంది.

దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే... ఉప్పు నీటిని పుక్కిలించి ఊసేయాలి. తద్వారా నోటిలో బ్యాక్టీరియా, గొంతు బ్యాక్టీరియా పరారవుతుంది. ఇది ఎంతో మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ ఈ రోజుల్లో డాక్టర్లు ఇలాంటి సూచనలు చెయ్యట్లేదు. వీటి బదులు... ఖరీదైన టూత్ పేస్టులు వాడమని సూచిస్తున్నారు.

ఉప్పు నీటిలో ఈదితే ఎంతో హాయి. బాత్ టబ్ నీటిలో ఉప్పు వేసి... ఆ నీటిలో జలకాలాడితే... స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటుందంటారు చాలా మంది. మరో ప్రయోజనం ఏంటంటే... నీటిని శుద్ధి చేసేందుకు చాలా మంది క్లోరిన్ వాడతారు. సాల్ట్‌లో క్లోరిన్ ఉంటుంది కాబట్టి... సాల్ట్ కూడా వాడొచ్చు. ఉప్పు... నీటిలో పొటాషియంను సమతుల్యంగా ఉంచుతుంది. అందువల్ల ఆ నీరు మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కళ్లలో మంటలు కూడా తగ్గుతాయి.

కొంతమంది ఎప్సమ్ సాల్ట్ బాత్‌ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ సాల్ట్‌లో మెగ్నీషియం సల్ఫేట్ హెప్తాహైడ్రేట్ ఉంటుంది. మెగ్నీషియం ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇది కండరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. చర్మంపై వాపులు, మంటల్ని తగ్గిస్తుంది.
Comentarios