Samsung Galaxy A31: సాంసంగ్ గెలాక్సీ A31 ధర తగ్గింది... లేటెస్ట్ రేట్ ఇదే
- Raju Shaik
- Dec 30, 2020
- 1 min read
Samsung Galaxy A31 | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? సాంసంగ్ గెలాక్సీ ఏ31 ధర తగ్గింది. లేటెస్ట్ ధరతో పాటు స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

ప్రముఖ మొబైల్ దిగ్గజం సాంసంగ్ మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ అందించింది. తన గెలాక్సీ A31 మోడల్ ధరను మరోసారి తగ్గించింది. 6GB +128GB స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చే ఈ స్మార్ట్ఫోన్పై రూ.2000 తగ్గింపు ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు రూ.19,999లకు అమ్ముడైన సాంసంగ్ గెలాక్సీ ఏ31ను ప్రస్తుతం రూ.17999లకే కొనుగోలు చేయవచ్చు. 2020 జూన్‌లో లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.21,999గా ఉండేది. అప్పటి నుంచి దీనిపై వరుసగా రెండు సార్లు తగ్గింపును ప్రకటించింది. గతంలో దీనిపై రూ.2,000 డిస్కౌంట్ అందించడంతో రూ.19,999లకు అమ్ముడయ్యేది. అయితే, ఇప్పుడు మరోసారి రూ.2,000 మేర తగ్గింపును ఇచ్చింది. దీంతో, ఇది ప్రస్తుతం రూ.17,999లకే లభిస్తుంది.
నూతన ధరతో ఇది అమెజాన్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీనితో పాటు రిటైల్ దుకాణాలు, సాంసంగ్ ఒపెరా హౌస్, Samsung.com, ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌లలో తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ బ్లూ, ప్రిజం క్రష్ వైట్ వంటి మొత్తం మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
సాంసంగ్ గెలాక్సీ A31 ఫీచర్లు
గెలాక్సీ ఎ 31లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డిప్లస్ సూపర్ AMOLED ఇన్ఫినిటీ యు డిస్‌ప్లే ప్యానల్ ఉంటుంది. ఇది 48MP క్వాడ్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ, అలైవ్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్స్‌తో వస్తుంది.
కెమెరా
దీనిలో 48MP ప్రైమరీ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5 MP డెప్త్ సెన్సార్, 5 MP మాక్రో లెన్స్ కెమెరాలను అందించారు. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా ముందు భాగంలో 20 ఎంపి కెమెరాను అందించారు. కాగా, ఇందులోని 48 ఎంపి మెయిన్ కెమెరాతో హై-రిజల్యూషన్ ఫోటోలు, వీడియోలు తీయవచ్చు. అంతేకాక, దీనిలో AI సీన్ ఆప్టిమైజర్‌తో పాటు AR డూడుల్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీనిలోని ఆగ్యుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగించి మీరు 3D ఆర్ట్ను కూడా గీయవచ్చు.
బ్యాటరీ
సాంసంగ్ గెలాక్సీ A31లోని 5000 mAh బ్యాటరీ 22 గంటల వరకు మీకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చే ఈ బ్యాటరీ మీకు స్ట్రీమ్, షేర్, గేమ్‌ను అనుమతిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్ పరంగా చూస్తే 4జీ వోల్డ్, WIFI బ్లూటూత్, జీపీఎస్, USB టైప్–సి పోర్ట్లు ఉన్నాయి. బయోమెట్రిక్ లాక్ కోసం వేలిముద్ర సెన్సార్‌ను కూడా దీనిలో అందించారు.
Comments