top of page

Smartphones under Rs 15000: కొత్త ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

  • Writer: Raju Shaik
    Raju Shaik
  • Dec 17, 2020
  • 3 min read

Best Smartphones under Rs 15000 | కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.15,000 లోపేనా? రెడ్‌మీ, రియల్‌మీ, సాంసంగ్ లాంటి బ్రాండ్స్ నుంచి అనేక మోడల్స్ ఉన్నాయి. ప్రస్తుతం రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఏవో తెలుసుకోండి.

ree

1. Realme Narzo 20: రియల్‌మీ నార్జో 20 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్‌డీ+ మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48+8+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్.



ree

2. Realme Narzo 20: రియల్‌మీ నార్జో 20 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 6,000ఎంఏహెచ్. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ నార్జో 20 గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. రియల్‌మీ నార్జో 20 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,499 కాగా 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.11,499.

ree

3. Realme Narzo 20 Pro: రియల్‌మీ నార్జో 20 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 90Hz అల్ట్రా స్మూత్ డిస్‌ప్లే ఉంది. 6జీబీ+64జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్‌లో రిలీజైంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48+8+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్.



ree

4. Realme Narzo 20 Pro: రియల్‌మీ నార్జో 20 ప్రో బ్యాటరీ 4500ఎంఏహెచ్ బ్యాటరీ. 65వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 38 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. రియల్‌మీ నార్జో 20 ప్రో వైట్ నైట్, బ్లాక్ నిన్జా కలర్స్‌లో లభిస్తుంది. రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999.


ree

5. Realme 7: రియల్‌మీ 7 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్.



ree

6. Realme 7: రియల్‌మీ 7 బ్యాటరీ కెపాసిటీ 5000ఎంఏహెచ్. 30వాట్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 64 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయొచ్చు. మిస్ట్ వైట్, మిస్ట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. రియల్‌మీ 7 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999.


ree

7. Redmi Note 9 Pro: రెడ్‌‌మీ నోట్ 9 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2400x1080 పిక్సెల్స్ డిస్‌ప్లే ఉండటం విశేషం. రెడ్‌‌మీ నోట్ 9 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌‌మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 48 (ప్రైమరీ)+8 (వైడ్ యాంగిల్)+5 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్‌లో 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్‌ప్లే కెమెరా ఉండటం విశేషం.

ree

8. Redmi Note 9 Pro: రెడ్‌‌మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5020 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. రెడ్‌‌మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ+64జీబీ ధర రూ.13,999 కాగా, 4జీబీ+128జీబీ ధర రూ.14,999.


ree

9. Moto G9: మోటో జీ9 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్‌డీ+ మ్యాక్స్ విజన్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మోటో జీ9 రియర్ కెమెరా 48+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్.




ree

10. Moto G9: మోటో జీ9 స్మార్ట్‌ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో డ్యూయెల్ నానో సిమ్ సపోర్ట్ ఉంటుంది. మోటో జీ9 స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, సాఫైర్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999.

ree

11. Samsung Galaxy M30s: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఇన్ఫినిటీ యూ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.




ree

12. Samsung Galaxy M30s: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రియర్ కెమెరా 48+8+5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 9 పై + వన్ యూఐ. ఓపల్ బ్లాక్, సాఫైర్ బ్లూ, పెరల్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ 4జీబీ+64జీబీ- రూ.13,999, 6జీబీ+128జీబీ- రూ.16,999.


ree

13. Realme 6i: రియల్‌మీ 6ఐ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే 1,080x2,400 పిక్సెల్స్‌తో ఉంది. మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48+8+2+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. బ్యాటరీ 4,300 ఎంఏహెచ్. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.



ree

14. Realme 6i: రియల్‌మీ 6ఐ ఎక్లిప్స్ బ్లాక్, లూనార్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,999 కాగా 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999.




ree

15. Micromax In Note 1: మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48+5+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్.


ree

16. Micromax In Note 1: మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 గ్రీన్, వైట్ కలర్స్‌లో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999 కాగా 4జీబీ+128జీబీ ధర రూ.12,499.


ree

17. Redmi Note 9: రెడ్‌మీ నోట్ 9 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.53 అంగుళాలో ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48+8+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్.




ree

18. Redmi Note 9: రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో 5,020ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10+ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆక్వా గ్రీన్, పెబ్బెల్ గ్రే, అర్క్టిక్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.11,999 కాగా, హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.14,999.


ree

19. Oppo A53: ఒప్పో ఏ53 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల డిస్‍ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 13+2+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్.




ree

20. Oppo A53: ఒప్పో ఏ53 బ్యాటరీ 5000ఎంఏహెచ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10+కలర్ ఓఎస్ 7.2. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫెయిరీ వైట్, ఫ్యాన్సీ బ్లూ, ఎలక్ట్రిక్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,990 కాగా, హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.15,490.

Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Instagram
  • Pinterest

©2020 by a2z News99

bottom of page