SSC CGL Notification 2021: నిరుద్యోగులకు అలర్ట్... 6506 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయండిలా
- Raju Shaik
- Jan 1, 2021
- 2 min read
SSC CGL Notification 2021 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 6506 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 6506 ఖాళీలను ప్రకటించింది. ఇందులో గ్రూప్ బీ గజిటెడ్ పోస్టులు 250, గ్రూప్ బీ నాన్ గజిటెడ్ పోస్టులు 3513, గ్రూప్ సీ పోస్టులు 2743 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంస్థలు, విభాగాల్లో డిగ్రీ అర్హతతో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. ఇన్‌స్పెక్టర్స్, ప్రివెంటీవ్ ఆఫీసర్స్, ఎగ్జామినర్, సబ్ ఇన్‌స్పెక్టర్, ఆడిటర్ ఆఫీసర్, అకౌంటెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. ప్రతీ ఏటా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. గతేడాది ఈ నోటిఫికేషన్ ద్వారా 9488 పోస్టుల్ని భర్తీ చేయగా... ఈసారి 6506 ఖాళీలను ప్రకటించింది. ఇవి తాత్కాలికంగా ప్రకటించిన ఖాళీలే. నియామక ప్రక్రియ ముగిసేనాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇదే వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. మరి ఈ నోటిఫికేషన్‌కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.
SSC CGL Notification 2021: అప్లై చేయండి ఇలా
అభ్యర్థులు ముందుగా https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం New User? Register Now పైన క్లిక్ చేయాలి.
మీ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు లాంటి బేసిక్ డీటెయిల్స్‌తో మొదటి ఫామ్ పూర్తి చేయాలి.
తర్వాతి స్టెప్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
మూడో స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
ఇక ముందే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసినవారు నేరుగా లాగిన్ కావొచ్చు.
రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీరు అప్పటికే పూర్తి చేసిన వివరాలు కనిపిస్తాయి.
ఆ వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్ చేయొచ్చు.
ఆ తర్వాత కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL నోటిఫికేషన్‌కు అప్లై చేయాలి.
ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జనవరి 31 చివరి తేదీ. ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి 2021 ఫిబ్రవరి 2 చివరి తేదీ. ఆఫ్‌లైన్‌లో చలానా పేమెంట్ చేయడానికి 2021 ఫిబ్రవరి 6 చివరి తేదీ.
Comments