Telangana: తాగి వాహనం నడిపితే ఇక తాట తీస్తారు.. మీ ఆఫీసుకు సమాచారంతో పాటు లైసెన్స్ రద్దు.. భారీ ఫైన్
- Raju Shaik
- Dec 28, 2020
- 1 min read
Hyderabad-Drunk and Drive: మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి చుక్కలు చూపించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఎవరైనా ఇప్పటి నుంచి తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే.. వారు పని చేసే ఆఫీసులకు ఈ సమాచారాన్ని చేరవేయనున్నారు.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి చుక్కలు చూపించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఫుల్లుగా మందేసి వాహనాలు నడుపుతూ వారితో పాటు ఇతర అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్న వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరైనా ఇప్పటి నుంచి తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే.. వారు పని చేసే ఆఫీసులకు ఈ సమాచారాన్ని చేరవేయనున్నారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలను వెల్లడించారు. తమ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది మొత్తం 3, 287 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఈ కేసుల సంఖ్యను భారీగా తగ్గించడమే లక్ష్యంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
ఇప్పటి నుంచి తాగి బండి నడుపుతే.. ఈ సమాచారాన్ని వారు పని చేసే ఆఫీసులకు చేరవేస్తామని తెలిపారు. మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ మొదటిసారి పట్టుబడితే.. రూ. 10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష, మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయనున్నట్లు తెలిపారు. ఇలానే రెండోసారి పట్టుబడితే రూ. 15 వేల ఫైన్ తో పాటు రెండేళ్ల జైలు, శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
కరోనా నేపథ్యంలో కొంత కాలంగా తగ్గించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ను అధికారులు మళ్లీ పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించి మద్య తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తిస్తున్నారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు.
Comments