Vakeel Saab teaser: రాస్కోరా సాంబ.. జనవరి 1, 2021 పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే..!
- Raju Shaik
- Dec 27, 2020
- 2 min read
పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వేచి చూస్తున్నారు అభిమానులు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత ఆ కిక్ చాలా వరకు మిస్ అయిపోయారు. అయితే ఇప్పుడు పవన్ మళ్లీ సినిమాలు చేస్తున్నాడని తెలిసి పండగ చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వేచి చూస్తున్నారు అభిమానులు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత ఆ కిక్ చాలా వరకు మిస్ అయిపోయారు. అయితే ఇప్పుడు పవన్ మళ్లీ సినిమాలు చేస్తున్నాడని తెలిసి పండగ చేసుకున్నారు. కానీ మాయదారి కరోనా వైరస్ వచ్చి అన్ని ప్లాన్స్ పాడు చేసింది. లాక్ డౌన్ కారణంగా ఎప్పుడో రావాల్సిన వకీల్ సాబ్ సినిమా ఇప్పటి వరకు రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త వచ్చింది. ఈయన వకీల్ సాబ్ సినిమా టీజర్ న్యూ ఇయర్ కానుకగా విడుదల కానుంది. నిజానికి దసరాకు టీజర్ విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించినా కూడా కుదర్లేదు. అయితే ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా ఈ టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారు. చడీచప్పుడు లేకుండా గిఫ్ట్ ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా వస్తుంది. ఈ మధ్యే వకీల్ సాబ్ షూటింగ్ మళ్లీ మొదలైంది. కొన్ని నెలలుగా ఖాళీగానే ఉన్న చిత్ర యూనిట్ కొన్ని రోజుల కింద పట్టాలెక్కించారు. మరో రెండు వారాలు మినహా షూటింగ్ అంతా పూర్తైపోయింది. సినిమా విడుదలను 2021 మార్చిలో ప్లాన్ చేస్తున్నారు.

అరకు పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ చాలా రోజులుగా నాన్‌స్టాప్‌గా జరుగుతూనే ఉంది. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్‌కి ముందే దాదాపు 80 శాతం పూర్తయింది. కేవలం కొన్ని రోజుల పార్ట్ మాత్రమే మిగిలిపోయింది. దాంతో పాటు హీరోయిన్ శృతి హాసన్ రావడం కూడా ఆలస్యమే అయింది. ఆమె వస్తే మిగిలిన షూటింగ్ కూడా పూర్తైపోతుందని ఇప్పటికే అనౌన్స్ చేసాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇప్పుడు అనుకున్నట్లుగానే పవన్, శృతి హాసన్ జంటపై వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. దాంతో పాటు పవన్ సోలో సీన్స్ కూడా అరకులో చిత్రీకరిస్తున్నాడు. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి.

తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2021 మార్చిలో వకీల్ సాబ్ విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో పవన్ అదిరిపోయే రీ ఎంట్రీ ఇస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈయన వకీల్ సాబ్ సినిమాతో పాటు అయ్యప్పునుమ్ కోషియమ్ రీమేక్, క్రిష్, హరీష్ శంకర్ సినిమాలకు కూడా కమిట్‌మెంట్ ఇచ్చాడు. దాంతో పాటే సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్ సినిమాలు కూడా లైన్‌లోనే ఉన్నాయి. అయితే ఎన్ని సినిమాలు ఒప్పుకున్నా కూడా రెండేళ్లలోపే పూర్తి చేయాలని చూస్తున్నాడు పవన్. ఎందుకంటే 2024 ఎన్నికలకు మళ్లీ సిద్ధం కానున్నాడు జనసేనాని. ఏదేమైనా కూడా జనవరి 1న వకీల్ సాబ్ టీజర్ వస్తే అభిమానులకు అంతకంటే పండగ చేసుకునే వార్త మరోటి ఉండదేమో..?
Comments