Viral Video: టీవీలో వస్తున్నట్టు డ్యాన్స్ చేయాలనుకుంది.. టీవీనే బద్దలు కొట్టేసింది
- Raju Shaik
- Dec 23, 2020
- 1 min read
టీవీలో డ్యాన్స్ చేస్తున్న నటిలా తానూ చేయాలనుకుంది. ఓ స్టెప్ చేసే ప్రయత్నంలో ఏకంగా టేబుల్‌పై ఉన్న టీవీని పట్టుకొని లాగింది ఆ చిన్నారి.

టీవీలో మంచి పాట చూస్తూ ఓ చిన్నారి డ్యాన్స్ చేసింది. పాట జోరుగా ఉండే సరికి ఉత్సాహంగా చిందేసింది. చివరకి ఆ టీవీనే పట్టుకొని లాగడంతో బద్దలైపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2018లో విడుదల తమిళ సినిమా లక్ష్మిలోని మొరక్కా పాట టీవీలో రావడంలో ఆ పాప డ్యాన్స్ చేసింది. టీవీ ముందు నిల్చొని దిత్యా భండే స్టెప్పులను కాపీ కొట్టింది. ఆ తర్వాత డ్యాన్స్ కొనసాగించింది.
ఈ క్రమంలో బస్‌లో హ్యాండ్ డ్రయల్స్ ను పట్టుకునే స్టెప్ రావడంతో ఆ చిన్నారి కూడా అలా చేసేందుకు ప్రయత్నించింది. ఏకంగా టేబుల్‌పైన ఉన్న టీవీనే పట్టుకొని లాగింది. అలా చేయగానే టీవీ కుప్పకూలింది. పాప తల్లిదండ్రులు వెంటనే వచ్చారు. ఆ అమ్మాయికి గాయాలు కాకుండా పక్కకు లాగేశారు.
ఈ వీడియోను ట్విట్టర్లో యూజర్ పోస్ట్ చేశారు. ఫ్యూ సెకన్స్ (కొన్ని సెకన్లు మాత్రమే) అని క్యాప్షన్ రాశారు. దీంతో ఈ వీడియో వేగంగా వైరల్ అయింది. కొద్దిసేపట్లోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి.
కాగా ఈ వీడియోపై చాలా మంది ఫన్నీ కామెంట్లు చేశారు.
“ఓ మై గాడ్. ఆ చిన్నారి ఎంతో క్యూట్‌గా, అమాయకంగా ఉంది. టీవీలోని అమ్మాయిలా డ్యాన్స్ చేయానుకొని అనుకుంది. కానీ సాధ్యం కాలేదు” అని ఓ యూజర్ కామెంట్ చేశారు. అయితే ఆ చిన్నారి ఎలా ఉందని, క్షేమమేనా అని మరికొందరు స్పందించారు.
Comments