Vitamin C: శీతాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఐదు Fruits ఇవే..
- Raju Shaik
- Dec 18, 2020
- 2 min read
చలికాలం అనగానే ఆకలి లేదు.. జీర్ణం కాలేదు.. మలబద్ధకం వంటి సమస్యలు చుట్టుముట్టే సీజన్ అందుకే సీ-విటమిన్ పుష్కలంగా తీసుకుంటే మీరు ఈ సీజన్ ను హ్యాపీగా దాటేయవచ్చు. ఎలాగూ మార్కెట్లో విటమిన్ సీ సప్లిమెంట్లు ఉన్నాయిగా వాటిని తీసుకుంటే సరి అని తాపీగా అనుకోకండి.

వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లితే శీతాకాలంలో (winter) అనారోగ్యం నుంచి కోలుకోవడం చాలా కష్టం. మరోవైపు కోవిడ్-19 (covid) ఇప్పటికే విలయతాండవం చేస్తున్న క్రమంలో మనలో రోగనిరోధక శక్తి (immunity) తగ్గకుండా చూసుకోవడం అత్యవసరంగా మారింది. ఇక చలికాలం అనగానే ఆకలి లేదు.. జీర్ణం కాలేదు.. మలబద్ధకం వంటి సమస్యలు చుట్టుముట్టే సీజన్ అందుకే సీ-విటమిన్ పుష్కలంగా తీసుకుంటే మీరు ఈ సీజన్ ను హ్యాపీగా దాటేయవచ్చు. ఎలాగూ మార్కెట్లో విటమిన్ సీ సప్లిమెంట్లు ఉన్నాయిగా వాటిని తీసుకుంటే సరి అని తాపీగా అనుకోకండి. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఇలా మనం సప్లిమెంట్లపై ఆధారపడటం ఏమాత్రం మంచిది కాదు. ప్రకృతి మనకు అన్ని విటమిన్లు, మినరల్స్ ను నాచురల్ గా అందిస్తుంటే ఈ సప్లిమెంట్లు ఎందుకు. సప్లిమెంట్స్ ఎప్పుడూ లాస్ట్ చాయిస్ గా వైద్యులు ఎందుకు చెబుతారన్నది గుర్తుంచుకోండి.

సీ విటమిన్ ఇందుకే.... చలి కాలం అనగానే చర్మ సమస్యలు చుట్టుముట్టే సీజన్. చర్మం నిగనిగలాడాలంటే సీ విటమిన్ నిల్వలు మీ ఒంట్లో ఉండాలి. చలితో పోరాడి, వ్యాధినిరోధక శక్తిని పెంచే సామర్థాయాన్ని మనకిచ్చేది సీ విటమినే. పొడిబారిన వాతావరణం కారణంగా రోగాలు, వైరస్ లపై పోరాడే శక్తి మందగించకుండా కాపాడుకోవాలంటే ఈ కింద చెప్పినవి క్రమం తప్పకుండా తీసుకోండి.

బత్తాయి (organe).... సీ విటమిన్ బాగా ఉన్న బత్తాయి తింటే మీలో ఇమ్యూనిటీ వృద్ధిచెందుతుంది. ఒక్క బత్తాయి తీసుకుంటే అందులో 128శాతం సీ విటమిన్ ఉంటుంది. మీకు నోటి రుచిని తెచ్చి, ఆహారం జీర్ణయ్యేలా చేసి, మీ ఒంట్లో పీచు పదార్థం పెంచి, మలబద్ధకాన్ని నిరోధించే బత్తాయిలు శీతాకాలంలో చాలా చవకగా లభిస్తాయి. కమలా, బత్తాయి, చీనా కాయలు ఇలా జాతి ఏవైనా అన్నీ ఆరెంజ్ కేటెగెరీలోకే వస్తాయి, ఇవన్నీ మీ బాహ్య సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

జామ (Guava)... శీతాకాలంలో ఎక్కువగా పండే జామలో సీ విటమిన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక్క జామ కాయలో 280శాతం సీ విటమిన్ ఉంటుంది. డయాబెటిక్స్ కి కూడా ఇది ఔషధంలా పనిచేస్తుంది. 'పేదవాడి యాపిల్' గా మనం పిలుచుకునే జామ రుచులను ఆస్వాదించండి.

బ్రకోలీ (broccoli)... ఆరోగ్యకరమైన కార్బోహైడ్రోట్స్, ఫైబర్ ఉన్న బ్రకోలీ కూడా ఈ సీజన్ లో ఎక్కువగా వస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే బ్రకోలీ చాలా మంచి ప్రొటీన్ కూడా.

కివి (Kiwi)... మీ మెనూలో కివీ పండు చేర్చుకుంటే మరీ మంచింది. సీ విటమిన్ ఎక్కువ ఉన్న కివీతో వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తుంది. ఇది కూడా సీజనల్ ఫ్రూటే, కానీ కాస్త ధర ఎక్కువ. ఒకప్పుడు కేవలం సూపర్ మార్కెట్లో లభించే కివీ పళ్లు ఇప్పుడు రోడ్డుపై కూడా లభిస్తున్నాయి.

బొప్పాయి... ఏడాది పొడవునా మనకు మార్కెట్లో ఇబ్బడి ముబ్బడిగా దొరికే బొప్పాయి అంటే మనకంటికి చాలా అలుసుగా కనిపిస్తుంది కదూ. సీ విటమిన్, ఏ విటమన్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న బొప్పాయితో వ్యాధినిరోధక శక్తి బాగా పెరుగుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి చురుకుదనాన్ని తెస్తుంది.

నిమ్మజాతి... నిమ్మ జాతి (Citrus) పళ్లన్నీ శీతాకాలంలోనే ఎక్కువగా పండుతాయి. కాబట్టి ఇవన్నీ చాలా చవకగా లభిస్తాయి. దానిమ్మ, నిమ్మ, చింతకాయ, ఉసిరి (Amla) వంటి పంటలు మనకు చలికాలంలోనే పండటం వెనుక ఉన్న మర్మం ఇదే. సీ విటమిన్ పెంపొందించుకునేందుకు ఇవన్నీ తినాలి కనుక ప్రకృతి మనకు వీటిని ఎక్కవగా శీతాకాలంలో దొరికేలా చేస్తుంది. చలికి పుల్లగా తినలే అంటే ఎలా, చలికి, చలి కారణంగా వచ్చే అనారోగ్యాలకు విరుగుడు ఈ పుల్లదనంలోనే ఉంది. నోటికి పుల్లటి రుచి తగులుతుంటే మీ రుచి మొగ్గలు ఉత్సాహంగా లేచి కూర్చుంటాయి. ఏమైనా తినాలనే అపటైట్ తెచ్చిపెట్టే గుణం ఉన్న పుల్లదనం ఆరోగ్యానికి రక్షణ ఇస్తుంది.
Comments