Vitamin C: శరీరంలో ఈ మార్పులు వస్తే విటమిన్ C తగ్గినట్లే... వెంటనే ఇలా చెయ్యండి
- Raju Shaik
- Dec 22, 2020
- 2 min read
Vitamin C: మనకు కరోనా సహా రకరకాల రోగాలు రాకుండా ఉండాలంటే విటమిన్ C తప్పనిసరి. మరి అది మనకు సరిపడా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఇలా చెయ్యండి.

ప్రపంచంలోకి కరోనా వైరస్ వచ్చాక... దాదాపు అన్ని దేశాల్లో ప్రజలూ విటమిన్ C, విటమిన్ D, జింక్ టాబ్లెట్లు వాడుతున్నారు. విటమిన్ C అనేది మనకు చాలా రకాల ఆహార పదార్థాలతో లభిస్తుంది. కాబట్టి... టాబ్లెట్ల కంటే... ఆహారమే మేలు. ఈ విటమిన్ C అనేది మన బాడీలో నిల్వ ఉండదు. మనకు కొద్దిగా వేడి చేసినా చాలు... ఇది బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల మనం కంటిన్యూగా విటమిన్ సీని పొందాలి. మన శరీరంలో ఇది సరిపడా లేకపోతే... మాటిమాటికీ మనకు నీరసం వచ్చేస్తుంది. ఏ పని చెయ్యబుద్ధి కాదు. అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కొద్దిగా పనిచేయగానే... విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. ఈ దశలో మీరు ఉంటే... వెంటనే మీరు జాగ్రత్తపడాలి. లేదంటే... మీపై వ్యాధులు దాడి చేయడానికి రెడీగా ఉంటాయి. విటమిన్ సీ లేకపోతే... రోగాలను బాడీ ఆపలేదు. అలాగే... తిన్న ఆహారం సరిగా అరగదు. పిల్లల్లో సరిపడా సీ విటమిన్ లేకపోతే... వారి ఎముకల్లో బలం ఉండదు. అందుకే ఇది చాలా ముఖ్యమైన విటమిన్.

మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి (Immunity Power)ని పెంచడంలో విటమిన్ సీ అద్భుతంగా పనిచేస్తుంది. జనరల్‌గా మనకు రోగాలు తెచ్చే సూక్ష్మ క్రిములు... మన శరీరంలోని కణాలను టార్గెట్ చేస్తాయి. అలా జరగకుండా... సీ విటమిన్ బాడీలో ఉంటే... సూక్ష్మజీవుల ఆటలు సాగవు. బాడీలో సీ విటమిన్ పెరిగేకొద్దీ... వైరస్‌లతో పోరాడే శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే విటమిన్ సీని మనం బాగా ఇష్టంగా పెంచుకోవాలి.

ఎవరికైనా హై-బీపీ (High Blood Pressure) ఉంటే... వారికి తప్పనిసరిగా విటమిన్ సీ మేలు చేస్తుంది. మెటబాలిజంను పెంచుతుంది. అంటే బాడీలో ఏవేవి ఎంత స్థాయిలో ఉండాలో అంత ఉండేలా చేస్తుంది. ఎక్కువ ఉంటే తగ్గిస్తూ... తక్కువ ఉంటే పెంచుతుంది. గుండె జబ్బులు రాకుండా కూడా సీ విటమిన్ కాపాడుతుంది. ఒత్తిడి, టెన్షన్ తగ్గాలంటే విటమిన్ సీ అవసరం. ఇది స్ట్రెస్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తూ మేలు చేసతుంది.

విటమిన్ సీ మనకు నిమ్మకాయలు, బత్తాయిలు, కమలాలు, నారింజలు, ఉసిరి, యాపిల్, పచ్చిమిర్చి, పుల్లగా ఉండే పండ్లలో ఉంటుంది. పుల్లటివి తింటే కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ద్రాక్షపండ్లు, బొప్పాయి, పుచ్చకాయి, స్ట్రాబెర్రీస్ వంటి వాటిలోనూ సీ విటమిన్ ఉంటుంది.

మీరు గూస్ బెర్రీ, ఎరుపు, పసుపు కాప్పికమ్, బొప్పాయి వంటి వాటిని తింటూ ఉండాలి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవాలి. కివీ పండు, మొలకలు, బ్రకోలీ, కాలీఫ్లవర వంటివి కూడా తింటే.. మీకు సీ విటమిన్ బాగా లభించినట్లే.

అల్లంలో వ్యాధుల్ని అడ్డుకునే శక్తి అపారంగా ఉంటుంది. మీరు టీ తాగినా, వంటలు వండుకున్నా... అందులో అల్లం వాడండి. తేనె, అల్లం రసం కలిపి వాడితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. రోజుకు మూడు-నాలుగు సార్లు అల్లం తీసుకుంటే... ఇమ్యూనిటీ పవర్ రాకెట్ లా పెరుగుతుంది.

తులసి తెలుసుగా... అది మామూలు మొక్క కాదు. రోజూ ఓ టీస్పూన్ తులసి ఆకుల్ని తిన్నారంటే... ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అలాగే... తులసితోపాటూ... 3 -4 మిరియపు గింజలు, ఓ టేబుల్ స్పూన్ తేనెను తీసుకున్నారంటే... కరోనా కాదు కదా... దాన్ని మించిన వైరస్ కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు.

బొప్పాయిలో విటమిన్ సీ బాగా ఉంటుంది. పైగా బొప్పాయి తింటే ఆహారం బాగా జీర్ణమవుతుంది. బొప్పాయిలో పొటాషియం, విటమిన్ B, ఫోలేట్ ఉంటాయి. ఇవి మొత్తం బాడీకి చాలా ఉపయోగపడతాయి.
Commenti