Weight Loss Diet: బరువు తగ్గాలంటే..ఈ Protein చాలా ముఖ్యం.. మీ డైట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
- Raju Shaik
- Dec 17, 2020
- 2 min read
Weight Loss Diet - Eggs Vs Paneer: మీరు సన్నబడాలనుకుంటే (weight reduction).. మజిల్ ను పెంచాలనుకుంటే ప్రొటీన్ (protein)ను తీసుకునేలా మీ డైట్ (diet)లో జాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చటంలో ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది.

మీరు సన్నబడాలనుకుంటే (weight reduction).. మజిల్ ను పెంచాలనుకుంటే ప్రొటీన్ (protein) ను తీసుకునేలా మీ డైట్ (diet)లో జాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చటంలో ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. హై క్వాలిటీ ప్రొటీన్ కు కేరాఫ్ అయిన గుడ్లు, పనీర్ లో కేవలం ప్రొటీన్ మాత్రమే కాకుండా ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాల్షియం, బీ12, ఐరన్ వంటి న్యూట్రియంట్స్ ఇందులో ఉన్నాయి. ఇక శాకాహారులకు అత్యుత్తమమైన ప్రొటీన్ అంటే పనీరే (paneer). అదే మాంసాహారులైతే కోడి గుడ్లు (egg) లేదా పనీర్ ఏదైనా ప్రొటీన్ వనరులుగా స్వీకరించవచ్చు. మరి వీటిలో ఏది బెస్ట్ అనేది తరచూ మనకు వచ్చే సహజమైన అనుమానం.
గుడ్లు
అతి చవకగా, ఎక్కవ ప్రొటీన్లు రావాలంటే, గుడ్లు ఉత్తమం. గుడ్ల ధర పనీర్ తో పోలిస్తే చాలా తక్కువ. అందుకే సన్నబడాలనుకునే వారు ప్రొటీన్ల కోసం గుడ్ల ను ఆశ్రయిస్తారు. ఎంతో ఆరోగ్యకరమైన గుడ్లంటే సూపర్ ఫుడ్. ఒక ఉడికించిన గుడ్డు బరువు సుమారు 44 గ్రాములు. ఇందులో ప్రొటీన్ 5.5గ్రాములుంటుంది. మొత్తం కొవ్వు విషయానికి వస్తే ఉడికించిన గుడ్డులో సుమారు 4.2 గ్రాముల కొవ్వు ఉంటుంది.
క్యాల్షియం 24.6 మిల్లీగ్రాములు, ఐరన్ 0.8 గ్రాములు, మెగ్నీషియం 5.3 మిల్లీ గ్రాములు ఉంటుంది. పాస్ఫరస్ 86.7మిల్లీగ్రాములు, పొటాషియం 60.3 మిల్లీ గ్రాములు, జింక్ 0.6 మిల్లీ గ్రాములు, కొలెస్ట్రాల్ 162 మిల్లీ గ్రాములు, సెలీనియం 13.4 మైక్రో గ్రామ్స్ ఉంటాయి. ఇవే కాకుండా గుడ్లలో విటమిన్లు ఎక్కువ ఉంటాయి. A,B,E, K విటమిన్లు సమృద్ధిగా ఉన్న గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచింది. కానీ చాలామందికి అవగాహన లేక కోడి గుడ్డులోని పచ్చ సొనను తీసేసి తింటారు. కానీ ఈ పచ్చ సొనలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలున్నాయి.
పనీర్
పనీర్ లేదా కాటేజ్ చీజ్ ను పాలతో తయారు చేస్తారు. అచ్చు కోడి గుడ్డు లానే పనీర్ తో కూడా బోలెడు వెరైటీ వంటలు వండుకోవచ్చు. పనీర్ శాండివిచ్, కర్రీ, లేదా పనీర్ ముక్కలను వేయించి మెయిన్ కోర్సులో లేదా స్నాక్స్ గా లాగించేయవచ్చు. 40 గ్రాముల లో ఫ్యాట్ కాటేజ్ చీజ్ లేదా పనీర్ ను తీసుకుంటే అందులో 7.54 గ్రాముల ప్రొటీన్, 5.88 గ్రాముల ఫ్యాట్, 4.96 గ్రాముల కార్బ్స్, 37.32 మైక్రోగ్రాముల ఫొలేట్స్, 190.4 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.
ఎగ్ Vs పనీర్
గుడ్లు, పనీర్ రెండూ దాదాపు సమానమైన పోషకాలున్న ఆహార పదార్థాలే. వివిధ విటమిన్లతో పాటు పోషకాలున్న ఈ రెండూ ఆహారంలో తరచూ తీసుకోవటం చాలా అవసరం. ముఖ్యంగా పెరిగే పిల్లలకు మరీ మంచిది. ఫిట్నెస్ కావాలనుకున్నా, బరువు తగ్గాలనుకున్న వీటిలోని ప్రొటీన్ చాలా సాయపడుతుంది. అందుకే ఈ రెండిటిలో ఏది అత్యుత్తమమైన ప్రొటీన్ అంటే చెప్పలేం. ఈ రెండింటి ధరలో వ్యత్యాసం ఉంది కానీ రెంటిలోనూ సమానమైన పోషకాలు, ప్రొటీన్ ఉన్నాయి. మీ రుచికి తగ్గట్టు, మీ బడ్జెట్ కు అనువుగా మీరు ఈ రెంటిలో ఏదైనా తినవచ్చు.
Comments