Whatsapp vs Signal App: భారత్‌లో వాట్సాప్‌కి షాక్.. సిగ్నల్ యాప్‌కి మారిపోతున్న కస్టమర్లు
- Raju Shaik
- Jan 11, 2021
- 2 min read
ఎవరు తీసుకున్న గొయ్యిలో వారే పడతారు అన్నట్లుగా వాట్సాప్ తీసుకున్న నిర్ణయం ఆ యాప్‌కి శాపంలా మారింది. మరి సిగ్నల్ యాప్ సంగతేంటి? అది ఎందుకు నచ్చుతోందో తెలుసుకుందాం.

Whatsapp vs Signal App: ఇన్నాళ్లూ వాట్సాప్ వాడిన మనకు... దాన్ని మానేసి... సిగ్నల్ యాప్ వాడాలంటే అదేంటో, ఎలా ఉంటుందో, వాడొచ్చో లేదో ఇలా చాలా డౌట్లు ఉంటాయి. కానీ... గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికే కోటి మందికి పైగా పైగా ఈ యాప్ వాడుతున్నారు. రేటింగ్ కూడా 4.5 ఇచ్చారు. ఇండియాలో సిగ్నల్ యాప్‌కు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎవరి నోట చూసినా ఇదే మాట.

వాట్సాప్ కొత్త సర్వీస్ రూల్స్ యూజర్లకు నచ్చట్లేదు. తమ ప్రైవసీకి దెబ్బ పడుతుందని ఆలోచిస్తూ... వాట్సాప్‌ని వదిలేసి... సిగ్నల్ యాప్‌కి జంప్ అవుతున్నారు. యాపిల్ ఇండియా యాప్ స్టోర్‌లో ఇది నంబర్ వన్ యాప్‌గా మారింది.

ఈ మధ్య వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నోటిఫికేషన్లను కస్టమర్లకు పంపించింది. వాటిని ఒప్పుకుంటేనే వాట్సాప్ వాడాలని మెలిక పెట్టింది. వాటిపై చాలామంది కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నారు. టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్, అమెరికన్ విజిల్‌బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్, ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే వంటి ప్రముఖులు... సిగ్నల్ యాప్‌ను వాడమని చెప్పేశారు. దాంతో అంతా సిగ్నల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.
యాపిల్ యాప్‌స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో సిగ్నల్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. iOS 9.0, ఆ తరువాత వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే యాపిల్ డివైజ్‌లలో ఇది పనిచేస్తుంది. Android 4, ఆ తరువాత వచ్చిన అప్‌డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే ఆండ్రాయిడ్ డివైజ్‌లలో సిగ్నల్ యాప్ పనిచేస్తుంది.
యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?: ముందు యాపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్‌లో సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయాలి. ఐఫోన్ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ‘Get’ ఆప్షన్‌ను ఎంచుకొని, యాపిల్ ఐడీ వివరాలను నమోదు చేయాలి. తరువాత 'Activate This Device' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. యాప్ డౌన్‌లోడ్ అయిన తరువాత ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత SMS ద్వారా మొబైల్ నంబర్‌కు 6 అంకెల కోడ్ వస్తుంది. దీన్ని నమోదు చేశాక ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. తర్వాత సిగ్నల్ యాప్ నోటిఫికేషన్లు పంపడానికి కస్టమర్లను అనుమతి అడుగుతుంది. దీన్ని యాక్సెప్ట్ చేసి ప్రొఫైల్ పిక్చర్, కస్టమర్ పేరు సెట్ చేయాలి. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండి, యాప్‌ను డౌన్‌లోన్ చేసుకున్న వ్యక్తులకు ఈ వివరాలన్నీ కనిపిస్తాయి. వాట్సాప్ లాగే ఈ యాప్‌ను ఉపయోగించడానికి సెండర్, రిసీవర్ ఇద్దరూ సిగ్నల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
డిఫాల్ట్ మెస్సేజింగ్ యాప్: Android యూజర్లు సిగ్నల్ యాప్‌ను డిఫాల్ట్ యాప్‌గా కూడా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల కస్టమర్లు సిగ్నల్ మేస్సేజ్‌లను, SMSను ఒకేచోట చూసుకోవచ్చు. ఈ ఆప్షన్ కోసం వినియోగదారులు ‘use as default SMS app’ను ఎంచుకోవాలి. యాప్ టూ యాప్ మెస్సేజ్‌లనే సిగ్నల్ ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. యాప్ యూజర్లు టెక్ట్స్, పిక్చర్, ఆడియో, వీడియో మెస్సేజ్‌లు, ఆడియో, వీడియో కాల్స్‌ను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ విధానంలో చేసుకోవచ్చు.
మెస్సేజ్‌లను ఎలా పంపాలి?: సిగ్నల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడే కాంటాక్ట్స్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతి అడుగుతుంది. దీనికి యాక్సెస్ ఇవ్వాలి. లేదంటే కాంటాక్స్ట్‌ను మ్యాన్యువల్‌గా అయినా ఎంటర్ చేయవచ్చు. వాట్సాప్ మాదిరిగానే మెస్సేజ్ చేయాలనుకున్నవారి కాంటాక్ట్‌ను ఎంచుకొని, పెన్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు ఓపెన్ అయ్యే చాట్‌లిస్ట్‌లో మెస్సేజ్ టైప్ చేసి పంపవచ్చు. సిగ్నల్ యాప్ లేని వినియోగదారులకు సాధారణ SMSను సెండ్ చేయవచ్చు. ప్రస్తుతం కస్టమర్లు వాడుతున్న మెస్సేజింగ్ యాప్‌కు బదులుగా, సిగ్నల్‌ను డిఫాల్ట్ మెస్సేజింగ్ యాప్‌గా మార్చుకోవచ్చు.
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ కాల్ ఫీచర్: సిగ్నల్ యూజర్లు తమ కాంటాక్ట్స్‌లో ఉన్నవారికి ఆడియో కాల్ చేసుకోవచ్చు. ఇందుకు యాప్‌లో కాంటాక్ట్‌ను సెలక్ట్ చేసుకొని, ఫోన్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. అక్కడే కనిపించే వీడియో కాల్ ఐకాన్‌పై క్లిక్ చేసి వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇందుకు ఫోన్ కెమెరా, మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి సిగ్నల్ యాప్‌కు అనుమతి ఇవ్వాలి. యాప్ ద్వారా ఎన్‌క్రిప్టెడ్ ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
Comments