WhatsApp: 'ప్రైవసీ' వివాదంపై స్పందించిన వాట్సప్... రియాక్షన్ ఇదే
- Raju Shaik
- Jan 11, 2021
- 1 min read
వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. యూజర్లు గత రెండుమూడు రోజులుగా వాట్సప్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై వాట్సప్ స్పందించింది. వివరణ ఇచ్చింది.

1. జనవరి 5న వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్‌ని ప్రకటించింది. 2021 ఫిబ్రవరి 8 లోగా కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరించాలని డెడ్‌లైన్ విధించింది. అప్పట్లోగా రూల్స్ యాక్సెప్ట్ చేయకపోతే వాట్సప్ ఉపయోగించడం సాధ్యం కాదని ప్రకటించింది.
2. వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్‌ని యూజర్లు అంగీకరిస్తే వారి ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, భాష, టైమ్ జోన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నీ వాట్సప్‌కు తెలుస్తాయి.
3. యూజర్ డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని కూడా తెలిపింది వాట్సప్. దీంతో తీవ్రస్థాయిలో విమర్శల్ని ఎదుర్కొంది. వాట్సప్ డిలిట్ చేసి కొత్త యాప్స్ ఉపయోగించాలన్న సూచనలు వినిపించాయి.
4. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా సిగ్నల్ యాప్ ఉపయోగించాలని కోరారు. వాట్సప్‌కు ప్రత్యామ్నాయ యాప్స్ డౌన్‌లోడ్స్ కూడా పెరిగాయి. వాటిలో టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్స్ ఉన్నాయి.
5. ఇలా ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతుండటంతో వాట్సప్ స్పందించింది. పారదర్శకంగా ఉండటానికి, బిజినెస్ ఫీచర్స్‌ను వివరించడానికి తమ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేశామని వాట్సప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ తెలిపారు.
6. ఇది బిజినెస్ కమ్యూనికేషన్ మాత్రమేనని, డేటా షేరింగ్‌కి సంబంధించి ఎలాంటి మార్పులు లేవని, యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎప్పట్లాగే కమ్యూనికేషన్‌లో ఉండొచ్చని, వారిపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు.
7. వాట్సప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఎప్పట్లాగే ఉంటుందన్న వాట్సప్ హెడ్, యూజర్ల ప్రైవేట్ ఛాట్స్, లేదా కాల్స్‌ను రికార్డ్ చేయమని, ఫేస్‌బుక్‌కు కూడా ఈ డేటా లభించదన్నారు.
8. ప్రైవసీ విషయంలో మేం పోటీలో ఉన్నామని, ఇది ప్రపంచానికి మంచిదని, ఇతరులతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలన్నదానిపై ప్రజలకు ఛాయిస్ ఉండాలని, వారి ఛాట్స్‌ని ఎవరూ చూడట్లేదన్న నమ్మకం ఉండాలని అన్నారు.
Comments