WhatsApp: వాట్సప్ వద్దా? అయితే 5 మెసేజింగ్ యాప్స్ ట్రై చేయొచ్చు
- Raju Shaik
- Jan 11, 2021
- 1 min read
WhatsApp Alternative Apps | వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీ రూల్స్ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో వాట్సప్‌ని డిలిట్ చేయాలన్న వాదన వినిపిస్తోంది. మరి మీరు కూడా వాట్సప్ డిలిట్ చేసే ఆలోచనలో ఉన్నారా? వాట్సప్ బదులు మీరు ఈ 5 మెసేజింగ్ యాప్స్ ట్రై చేయొచ్చు.

WhatsApp: వాట్సప్ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసింది. ఫిబ్రవరి 8 లోగా యాక్సెప్ట్ చేయాలని యూజర్లను కోరుతోంది. కొత్త ప్రైవసీ రూల్స్ యాక్సెప్ట్ చేయకపోతే వాట్సప్ యాప్ ఉపయోగించడం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. కొత్త ప్రైవసీ పాలసీలోని అంశాలపై యూజర్లలో ఆందోళన కొనసాగుతోంది. అందుకే వాట్సప్ బదులు ఇతర యాప్స్ ఏవైనా ఉపయోగించాలని అనుకుంటున్నారు. వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా 5 ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్ కనిపిస్తున్నాయి. అవేంటో తెలుసుకోండి.

Telegram: వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా టెలిగ్రామ్ పేరు ముందుకు వస్తోంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. వాట్సప్ లాగానే టెలిగ్రామ్‌లో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది. ఈ యాప్ ఉచితం. MTProto ప్రోటోకాల్ ఉపయోగిస్తున్నాం కాబట్టి తమ యాప్ వాట్సప్ కన్నా సురక్షితమని టెలిగ్రామ్ చెబుతోంది.

Signal: టెలిగ్రామ్ తర్వాత పాపులర్ అవుతున్న యాప్ సిగ్నల్. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. విండోస్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా సిగ్నల్ యాప్ ఉపయోగించాలని కోరడంతో డౌన్‌లోడ్స్ బాగా పెరిగాయి. నాన్ ప్రాఫిట్ సంస్థ అయిన సిగ్నల్ ఫౌండేషన్ రూపొందించిన ఎన్‌క్రిప్టెడ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇది.

Threema: త్రీమా పెయిడ్ మెసేజింగ్ యాప్. ఇందులో మెసేజెస్ ఆటో డిలిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. గ్రూప్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ లిస్ట్ క్లౌడ్‌లో కాకుండా మీ ఫోన్‌లోనే స్టోర్ చేస్తుంది. 8 అంకెల త్రీమా ఐడీతో కమ్యూనికేట్ కావచ్చు. ఇందులో కూడా ఎండ్ టు ఎండ్ ఇన్‌క్రిప్షన్, వాయిస్ కాల్స్, ఫైల్ షేరింగ్, గ్రూప్ ఛాట్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Element: ఎలిమెంట్ కూడా ఇతర మెసేజింగ్ యాప్స్ లాంటిదే. ఇందులో కూడా మెసేజెస్, వాయిస్ కాల్స్, వీడియోలకు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. మెసేజెస్‌ని ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఫ్రీ వర్షన్‌తో పాటు పెయిడ్ వర్షన్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, లైనక్స్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ఉపయోగించొచ్చు.

Viber: వైబర్ కూడా కాలింగ్, మెసేజింగ్ యాప్. ఆడియో, వీడియో కాలింగ్ చేయొచ్చు. గ్రూప్ ఛాట్స్ కూడా ఉంటాయి. సెల్ఫ్ డిస్ట్రక్ట్ ఫీచర్ ఉంది. మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. అన్ని కాల్స్, ఛాట్స్‌కి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. ఇది కూడా ఫ్రీ యాప్.
Comentários