ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత ఆనందంగా ఉంటారట..
- Raju Shaik
- Dec 12, 2020
- 1 min read
ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత ఆనందంగా ఉంటారట.. ఆ ఆరోగ్య ప్రయోజనాలు కూడా.. అధ్యాయనంలో తేలిన ఆసక్తికర విషయాలివే..
Happiness: యునైటెడ్ స్టేట్స్ లో సుమారు 2 వేల మందిపై ఇటీవల సర్వే నిర్వహించారు. వారు రోజుకు వినియోగించే నీటి పరిమాణం ఆధారంగా ఈ సర్వే జరిపారు. ఎక్కువ నీరు తాగిన వారు ఆశావహులు, శక్తివంతులు మరియు జీవితంలో విజయవంతమవుతున్నట్లు సర్వేలో గుర్తించారు. ఇంకా ఏం తేలిందంటే..

ఆరోగ్యంగా ఉండడానికి తాగునీరు చాలా ముఖ్యం అని అందరికీ తెలుసు. కానీ నీళ్ళు తాగడం సంతోషంగా ఉండడానికి సహాయపడుతుందని మీకు తెలుసా? యునైటెడ్ స్టేట్ లో తాజాగా నిర్వహించిన కొత్త సర్వే ప్రకారం మనం ఎక్కువగా నీరు తాగితే ఎక్కువగా ఆనందంగా ఉంటామని తేలింది.

యునైటెడ్ స్టేట్ లో సుమారు 2 వేల మందిపై ఈ సర్వే జరిగింది. వారు రోజుకు వినియోగించే నీటి పరిమాణం ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. ఎక్కువ నీరు తాగిన వారు ఆశావహులు, శక్తివంతులు మరియు జీవితంలో విజయవంతమవుతున్నట్లు సర్వేలో గుర్తించారు. ఇంకా ఏం తేలిందంటే..

సర్వే చేసిన వారిలో నలభై ఒక్క శాతం మంది ప్రతీ రోజూ పుష్కలంగా నీరు తాగుతున్నారని చెప్పారు. రోజుకు ఆరు గ్లాసుల కంటే ఎక్కువ నీరు తాగే వ్యక్తులు జీవితం గురించి మరింత ఆశాజనకంగా ఉంటారని సర్వేలో తేలింది.

సర్వేలో పాల్గొన్న వారిలో పన్నెండు శాతం మంది ప్రతిరోజూ చాలా తక్కువ నీరు తాగుతున్నామని చెప్పారు.

ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి జీవితంలో తాగునీరు చాలా ముఖ్యమైనదని సర్వేలో తేలింది.

తక్కువ నీరు తాగిన వారికంటే ఎక్కువ నీరు తాగామని చెప్పిన వారిలో నలభై శాతానికి పైగా ఎక్కువ శక్తివంతులు, ఆశావాదులు ఉన్నారని సర్వేలో తేలింది.

శరీరానికి రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు అవసరమని అంచనా. ఇది సుమారు రెండున్నర లీటర్లు అన్నమాట. అయితే పిల్లలు కూడా నిత్యం కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. దాహంగా లేకపోయినా కూడా ఎక్కువగా నీరు తాగాలని సూచిస్తున్నారు.

ఇంకా చర్మం మెరుస్తూ ఉండడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి, శరీరం నుంచి విషాన్ని బహిష్కరించడానికి కూాడా నీరు చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.

ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత రెండు గ్లాసుల నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహారంతో పాటు ఎక్కువగా నీరు తాగడం చాలా మందికి అలవాటు. ఇది అంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
Comentários