ఒకే కొండ.. రెండు ఆలయాలు.. 8వేల మెట్లు.. ప్రకృతి అందాలు.. ఎక్కడంటే
- Raju Shaik
- Dec 31, 2020
- 1 min read
కొండ రెండుగా చీలి ఉండగా.. ఒకవైపు బుద్ధుడి ఆలయం(Temple).. మరోవైపు మైత్రేయ ఆలయం ఉంది. ఈ ఆలయాలను ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిపోయింది.

దైవ దర్శనం మనసుకు ప్రశాంతత ఇస్తుంది. దేవుడి కరుణ కోసం భక్తులు ఎంత కష్టమైనా పడేందుకు ఇష్టపడతారు. కొండలైనా, మెట్లైనా తమ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ సునాయాసంగా ఎక్కేస్తారు. సాధారణంగా కొండలపై ఉన్న ఆలయాల పరిసరాలు అత్యంత సుందరంగా ఉంటాయి. పచ్చనిచెట్లు, జలపాతాలు ఇలా మనోహరంగా అనిపిస్తాయి. అదే ఒకే కొండ రెండుగా చీలి.. రెండు దేవాలయాలు ఉంటే అది అద్భుతమే. ఇలాంటి విశేష ఆలయాలు చైనా(China)లోని పులింగ్ పర్వతశ్రేణిలోని ఫంజింగ్షాన్ అనే ప్రాంతంలో ఉన్నాయి. ఈ ఆలయాలకు చేరుకోవాలంటే భక్తులు ఏకంగా 8వేల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
రెండుగా చీలిన కొండపై దక్షిణ భాగం వైపు బుద్ధిడి ఆలయం ఉంది. ఉత్తర భాగంలో మైత్రేయ ఆలయం కొలువైంది. వీటిని కలుపుతూ ఓ బ్రిడ్జి సైతం నిర్మితమైంది. ఈ కొండను చేరుకునేందుకు 8వేల మెట్లు ఎక్కే సమయంలో భక్తులకు ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. మెట్లు ఎక్కుతున్న కష్టాన్ని తెలియకుండా చేస్తాయి. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలు, మెట్లు ఎక్కుతున్న కొద్ది చేతికి ఆకాశం అందుతున్న అనుభూతి.. కాసేపట్లో దేవుడిని దర్శించుకుంటామన్న ఆనందంలో భక్తులు సాహసోపేతమైనా ఈ కొండలను అవలీలగా ఎక్కేస్తుంటారు. అయితే ఆలయాలకు చేరుకునేందుకు హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది.

ఆలయ చరిత్ర ఇదే..
క్రీస్తు శకం 7 నుంచి 10 శతాబ్దాల మధ్య చైనాను పాలించిన ట్యాంగ్ రాజులు ఈ ఆలయాలను నిర్మించాలని చరిత్ర చెబుతోంది. అయితే వీటిని అంత ఎత్తులో ఎలా నిర్మాచారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎంత మంది పరిశోధనలు జరిపినా ఇంకా మిస్టరీగానే ఉంది. మింగ్, క్వింగ్ రాజుల శాసనాలు సైతం ఇప్పటికి కొండపై ఉన్నాయి. ఈ ఆలయాలను దర్శించుకోవడం సాహసోపేతమే అయినా అధిక సంఖ్యలో భక్తులు వస్తూనే ఉంటారు. చైనా వాసులే కాక విదేశాల నుంచి వచ్చేవారు ఈ కొండను ఎక్కేందుకు ఇష్టపడతారు. ఇక్కడికి సమీపంలోనే ఫంజింగ్శాన్ నేషనల్ పార్క్ కూడా ఉంది.
Comentários