top of page

పప్పీలతో పిల్లాడి ఆట.. నెటిజన్ల మనసు దోచేస్తున్న వీడియో

  • Writer: Raju Shaik
    Raju Shaik
  • Dec 23, 2020
  • 1 min read

టీ ష్టర్టు, ప్యాంట్ వేసుకున్న క్యూట్ పిల్లాడు.. కుక్క పిల్లల(Puppies)తో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral video)​గా మారింది.

ఒక్కోసారి చిన్న వీడియోలు కూడా మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయి. బాధల్లో ఉన్నా సంతోషం కలిగిస్తాయి. ఇక చిన్నపిల్లల అమాయకత్వం, నిష్కల్మషమైన చర్యలతో కూడిన వీడియోలైతే మంచి అనుభూతిని ఇస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఓ వీడియో వైరల్​గా మారింది. ఓ చిన్న పిల్లాడు.. నాలుగు పప్పీ(కుక్క పిల్లలు)లతో ఆడుకుంటున్న వీడియో నెటిజన్ల మనసులను దోచేస్తోంది.

ప్యాంటు, టీ షర్టు వేసుకొని ఎంతో క్యూట్​ గా ఉన్న ఓ పిల్లాడు నాలుగు పప్పీలతో ఆడుకున్నాడు. అవి అతడి చుట్టే తిరుగుతూ సందడి చేశాయి. ఆ పిల్లాడికి గిలిగింతలు కూడా పెట్టాయి. నవ్వించాయి. మీదమీదకు వస్తూ ప్రేమను చాటాయి. వీటితో ఆడుకుంటున్నంత సేపు ఆ పిల్లాడు ఎంతో ఎంజాయ్ చేశాడు. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు.


ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో చూస్తున్న నెటిజన్లు షేర్లు, కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఎంతో క్యూట్​గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Comentários


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Instagram
  • Pinterest

©2020 by a2z News99

bottom of page