బీట్ రూట్ ను పక్కన పెడుతున్నారేమో.. దీని గురించి తెలిస్తే మగాళ్లు అస్సలు వదిలిపెట్టరు..!
- Raju Shaik
- Jan 5, 2021
- 1 min read
Updated: Jan 9, 2021
Beet Root Health Benefits : ఆకుకూరలు, కూరగాయల నుంచే శరీరానికి అవసరం అయ్యే ఎక్కువ పోషకాలు అందుతాయని అందరికీ తెలిసిందే. కానీ కొందరు కొన్ని రకాల కూరగాయలను తినడానికి ఇష్టపడరు. బీట్ రూట్ కూడా ఆ కోవకే వస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన అతి తక్కువ మంది మాత్రమే మార్కెట్లో బీట్ రూట్ ను కొంటుంటారు.

మార్కెట్ కు వెళ్తే చాలు ఎర్రెర్రగా కనిపిస్తూ బెదిరిపోయేలా చేసే బీట్ రూట్ ను అతి తక్కువ మంది ఇష్టపడుతుంటారు. అసలు బీట్ రూట్ కూరను తినడానికే చాలా మంది ఇష్టపడరు. బయట వందల రూపాయలు వెచ్చించి హెల్త్ డ్రింకులను కొని కొందరు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటారు. కానీ బీట్ రూట్ లాంటి సహజ సిద్ధంగా లభించే దుంపలను పచ్చిగా తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా, కూర చేసుకుని తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

బీట్ రూట్ ను రోజూ డైట్ లో చేర్చుకుంటే శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. రోజూ బీట్ రూట్ జ్యూస్ ను తాగితే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
బీట్ రూట్ లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఈ బీట్ రూట్ ను కనుక ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంటుంది.
డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారికి బీట్ రూట్ ఒక వరం లాంటిది. బీట్ రూట్ ను జ్యూస్ రూపంలో డీహైడ్రేషన్ బాధితులు తీసుకుంటే వారి సమస్య తీరిపోయినట్టే. శరీరానికి అవసరమయిన నీటి శాతాన్ని బీట్ రూట్ అందిస్తుంటుంది.
రక్తహీనత సమస్య ఉన్నవారికి బీట్ రూట్ ఒక దివ్యౌషధం. బీట్ రూట్ ను ప్రతిరోజూ తినడం వల్ల రక్త హీనత సమస్యను విజయవంతంగా ఎదుర్కొనవచ్చు. పురుషుల శృంగార సామర్థ్యాన్ని కూడా బీట్ రూట్ పెంచుతుందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు.
Comentários