బాలుడికి సాయం చేసిన బ్లేడ్ రన్నర్.. వైరల్ అవుతున్న వీడియో
- Raju Shaik
- Dec 23, 2020
- 1 min read
పారాలింపిక్స్ (paralympics)లో ఎనిమిది సార్లు పతకాలు సాధించిన బ్లేక్ లీపర్ (blake leeper) మరోసారి వార్తల్లో నిలిచారు. తనలాగా కాళ్లు లేని రెండేళ్ల బాలుడికి నడవడానికి అతడు సహాయం చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

పారాలింపిక్స్ (paralympics)లో ఎనిమిది సార్లు పతకాలు సాధించిన బ్లేక్ లీపర్ (blake leeper) మరోసారి వార్తల్లో నిలిచారు. తనలాగా కాళ్లు లేని రెండేళ్ల బాలుడికి నడవడానికి అతడు సహాయం చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. డాక్టర్లు ఆ బాలుడికి మొదటిసారి ప్రొస్తెటిక్ కాలును అమర్చారు. దాంతో బ్యాలెన్స్ చేసుకోలేకపోవడంతో బ్లేక్ అతడికి సాయం చేశారు. కొత్త కృత్రిమ కాలులో ఎలా నడవాలో బ్లేక్ చూపించాడు. ఈ వీడియో సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకుంటోంది. బ్లేక్‌తో పాటు ఆ బాలుడి ప్రయత్నాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు. మాజీ అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘మొదటిసారిగా ప్రోస్తెటిక్ కాలుతో నడించేందుకు ఒక బాలుడికి సహాయం చేస్తున్న ఛాంపియన్’ అనే ట్యాగ్‌తో అతడు వీడియోను షేర్ చేశాడు.
2021లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కోసం బ్లేక్ సిద్ధమవుతున్నాడు. ఇందుకు కొత్త ఆర్టిఫిషియల్ రన్నింగ్ లెగ్స్ కోసం వెళ్లినప్పుడు అక్కడ ఆ బాలుడు కనిపించాడు. నడవడానికి ఇబ్బంది పడుతున్న ఆ చిన్నారికి బ్లేక్ సహాయం చేశాడు. ఈ వీడియోకు ట్విట్టర్‌లో ఇప్పటివరకు 7,30,000 వరకు వ్యూస్, 40,000 పైగా లైక్స్ వచ్చాయి. బ్లేక్ లీపర్‌ను, ఆ బాలుడిని ప్రశంసిస్తూ కొన్ని వేలమంది యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇలాంటి విషయాలను ప్రేమించండి అంటూ ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. ‘ఆ బాలుడికి బ్లేక్ శాంటాక్లాజ్‌గా నిలిచారు’ అని మరొకరు కామెంట్ పెట్టారు. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తారు అని మరో యూజర్ ట్వీట్ చేశాడు.
కొత్త ప్రోస్తెటిక్ కాళ్లతో
బ్లేక్ లీపర్ ఒక బ్లేడ్ రన్నర్. కృత్రిమ కాళ్లతోనే అతడు రన్నింగ్ పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించాడు. ఇటీవల ప్రత్యేకంగా తయారుచేసిన ప్రొస్తెటిక్ లెగ్స్‌ను అధికారులు అనుమతించలేదు. వాటి ద్వారా బ్లేక్ ఎత్తు పెరుగుతుందని, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. తన పాత ప్రోస్తెటిక్స్ లెగ్స్ సాయంతో టోక్యో ఒలింపిక్స్‌లో పోటీ పడేందుకు బ్లేక్‌కు అనుమతులు ఇవ్వలేదు. దీంతో కొత్తరకం కృత్రిమ కాళ్లతో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగే ప్రయత్నాలను అతడు ప్రారంభించాడు.
Comments