మీ ప్రైవసీ మాకు ముఖ్యం: ప్రతీ యూజర్‌కు పర్సనల్‍గా వాట్సప్ క్లారిటీ
- Raju Shaik
- Jan 17, 2021
- 1 min read
మీ ప్రైవసీ మాకు ముఖ్యం: ప్రతీ యూజర్‌కు పర్సనల్‍గా వాట్సప్ క్లారిటీ

Whatsapp: దేశంలో ఓటు హక్కు ఉన్న వారికంటే స్మార్ట్ ఫోన్ యూజర్లే ఎక్కువ ఉన్నారు. దాదాపు అందరి ఫోన్లలో ప్రత్యక్షమవుతున్న యాప్ Whatsapp. ఈ రేంజ్ లో వాడేస్తున్న యాప్ ప్రైవసీపై ఇన్నేళ్లుగా నమ్మకం పెట్టుకున్న వాళ్లందరికీ ఒక అపోహ మిగిలిపోయింది. ఫేస్‌బుక్ తో డేటా షేర్ చేసుకుంటామని ప్రకటించగానే మన డేటా మొత్తం ఎక్కడ షేర్ అవుతుందో అని భయపడుతున్నారు.
క్లారిటీ ఇచ్చేందుకు Whatsapp కూడా.. ‘రీసెంట్ అప్‌డేట్ గురించి చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది. ఈ అప్‌డేట్ ఫేస్ బుక్ తో డేటాను షేర్ చేసుకునే సామర్థ్యం పెరగడం లేదు. ప్రజల నిర్ణయం ప్రకారమే పాలసీని సెట్ చేస్తాం. మే15నుంచి కొత్త బిజినెస్ ఆప్షన్లు రానున్నాయి’ అని వెల్లడించింది.
ఇది చాలాదన్నట్లు అందరి ఫోన్ స్టేటస్ లలో ప్రత్యేకమైన మెసేజ్‌లతో అప్‌డేట్‌లు ఇచ్చింది.
మీ ప్రైవసీ కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం.

మీ పర్సనల్ కన్వర్సేషన్లు Whatsapp చదవదు.. వినదు అవెప్పుడూ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి.

మీరు షేర్ చేసిన లొకేషన్‌ను Whatsapp చూడదు.

Whatsapp మీ కాంటాక్ట్‌లను ఫేస్‌బుక్‌తో పంచుకోదు.

Comments