top of page

మీ ఫోన్ పోయిందా? ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్.. ఏదైనా క్షణాల్లో ఇలా ట్రాక్ చేయొచ్చు!

  • Writer: Raju Shaik
    Raju Shaik
  • Jan 17, 2021
  • 2 min read

Updated: Jan 18, 2021

మీ ఫోన్ పోయిందా? ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్.. ఏదైనా క్షణాల్లో ఇలా ట్రాక్ చేయొచ్చు!

Find a Lost Phone That’s Turned Off : మీ మొబైల్ ఫోన్ పోయిందా? కంగారపడకండి.. మీ స్మార్ట్ ఫోన్ ఎక్కడికి పోలేదు.. ఈజీగా దొరికేస్తుందిలే.. అది ఎలానో తెలుసా? సాధారణంగా అందరికి తెలిసిందే.. ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్ల కోసం ప్రత్యేకించి టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్ జాడ కనిపెట్టే ఈ టూల్స్ మీ ఫోన్ ఎక్కడ పొగట్టుకున్నారో వెతికి పెడతాయి. మీ ఫోన్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తాయి. ఇంతకీ మీ ఫోన్ ఏంటి? ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్.. ఏ ఫోన్ అయినా ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఒకవేళ మీ ఫోన్ టర్న్ ఆఫ్ లేదా స్విచ్ఛాఫ్ అయితే ఎలా? అంటారా? కొంచెం కష్టమే.. ఇలాంటి సందర్భాల్లో ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ప్రత్యేకించి టూల్స్ ఉన్నాయి. ఇందులో ఐఫోన్ వెర్సస్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏయే ఎక్కడ పొగట్టుకున్నారో తెలుసుకోవచ్చు. అదేలానో చూద్దాం..



ఐఫోన్.. కనిపెట్టడం ఎలా?

ఐఫోన్ల కోసం స్పెషల్ టూల్ ఒకటి ఉంది. అదే.. Find My iPhone టూల్. మీ ఐఫోన్ లొకేషన్ కనిపెట్టడంలో ఈ టూల్ ఎంతో బెస్ట్ అని చెప్పాలి. ముందుగా మీరు iCloud.comలోకి వెళ్లండి. అక్కడ Find My iPhone టూల్ యాక్సస్ చేయండి. ఇందులో మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడే All Devices అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఆ జాబితాలో మీరు పొగట్టుకున్న ఫోన్ సెలక్ట్ చేయండి. మీకు స్ర్కీన్ పై.. ఫోన్ లొకేషన్‌తో కూడిన ఒక మ్యాప్ కనిపిస్తుంది.


మీ ఫోన్ స్విచ్చాఫ్ అయితే ట్రాకింగ్ ఎలా?



ఐఫోన్లలో అయితే ఈ ఆప్షన్ బాగా పనిచేస్తుంది. ఐఫోన్ స్విచ్చాఫ్ అయినా కూడా ఈజీగా లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ ఫోన్ లొకేషన్ వాడినప్పుడు.. ఫోన్ ఆఫ్ లైన్ లో ఉన్నా కూడా అది ఆఫ్ లైన్ లోకి వెళ్లడానికి ముందు ఏ లొకేషన్ లో ఉందో ట్రాక్ చేస్తుంది. మ్యాప్ ద్వారా అప్పటి లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. మీ ఐఫోన్ ఎవరైనా ఆన్ చేస్తే.. వెంటనే మీకు ఈమెయిల్ వస్తుంది. అందుకు మీరు చేయాల్సిందిల్లా.. Notify అనే ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది.


ఐఫోన్లో మాదిరిగానే ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఇలానే ట్రాక్ చేయొచ్చు. అదే.. ఆండ్రాయిడ్ ఫోన్లలో అయితే మాత్రం లొకేషన్ ఎప్పుడూ ఆన్ లోనే ఉండాలి. ఆన్ లైన్ లో ఉంటేనే ఫోన్ లొకేషన్ కనిపెట్టేందుకు సాధ్యపడుతుంది.


పోగట్టుకున్న ఫోన్ లాక్ చేయడం ఎలానంటే? :

ఫోన్లో మీ సమాచారాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే లాక్ స్ర్కీన్ ఎంతో బెటర్.. ఐఫోన్లలో అయితే Lost Mode iPhone, అదే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ నుంచి Lock My Phone ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు మీ ఫోన్ ఎక్కడ ఉన్నా ఆటో లాక్ అయిపోతుంది. మీ ఫోన్ దొంగిలించినవారు మీ ప్రైవేటు ఫొటోలు, బ్యాంకు యాప్స్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని యాక్సస్ చేయలేరు.



మీ ఐఫోన్ కోల్పోతే.. మీ ఫోన్ స్ర్కీన్ రిమోట్ గా లాక్ వేయొచ్చు. ఒకవేళ మీరు ఫోన్ పాస్ వర్డ్ సెటప్ చేయకపోయినా ఈ ప్రాసెస్ చేయొచ్చు.

  • Find My iPhone ఆప్షన్‌లోకి వెళ్లండి.

  • Log in అవ్వండి.

  • స్ర్కీన్ టాప్‌లో డివైజ్ మెనూపై క్లిక్ చేయండి.

  • ఇక్కడే మీరు lost iPhone ఆప్షన్ ఎంచుకోండి.

  • Lost Mode ఆప్షన్ పై క్లిక్ చేయండి.

  • కాంటాక్ట్ నెంబర్ ఎంచుకోండి.

  • Next ఆప్షన్ పై కూడా ఎంచుకోండి.

  • మీ ఫోన్ ఎవరికైనా దొరికితే కనిపించేలా మెసేజ్ ఇక్కడ టైప్ చేయండి.

  • Done పై క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ ఫోన్లలో.. Find My Device Tool సెలక్ట్ చేసుకోండి. వెంటనే మీ ఫోన్ లాక్ అయిపోతుంది. ఒకవేళ మీరు పాస్ వర్డ్ లేదా పిన్ లేదా ప్యాటరన్ ఏది సెట్ చేసినా కూడా లాక్ వేయొచ్చు.

  • Find My Device లోకి వెళ్లండి.

  • గూగుల్ అకౌంట్ ద్వారా Log in అవ్వండి. అది కూడా మీ ఫోన్ అసోసియేట్ అయి ఉండాలి.

  • మీరు ఒక ఫోన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. టాప్ స్ర్కీన్ పై మెనూ సెలక్ట్ చేయండి.

  • Secure Device ఆప్షన్ పై క్లిక్ చేయండి.

  • మీ ఫోన్ ఎవరికైనా దొరికితే కనిపించేలా మెసేజ్ ఇక్కడ టైప్ చేయండి.

  • Secure Device పై క్లిక్ చేయండి.



Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Instagram
  • Pinterest

©2020 by a2z News99

bottom of page