రూ.70 వేల ఫోన్ రూ.25 వేలకే.. ఫ్లిప్ కార్ట్ సేల్‌లో సూపర్ ఆఫర్!
- Raju Shaik
- Dec 21, 2020
- 1 min read
Lg G8x Is Now Available At Rs 25990 In Flipkart Big Saving Days Sale Check Details

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఎల్జీ ఈ సంవత్సరం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో మళ్లీ సేల్‌కు ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ సేల్ మళ్లీ ఫ్లిప్ కార్ట్‌లో జరుగుతోంది.
ఎల్జీ జీ8ఎక్స్.. ఈ సంవత్సరం అక్టోబర్‌లో బిగ్ బిలియన్ డేస్‌లో బాగా వినిపించిన పేరు. రూ.70 వేల ఫోన్‌ను రూ.19,990కే ఈ సేల్‌లో విక్రయించారు. తర్వాత ఈ ఫోన్ ధర రూ.31,990కు పెరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ సేల్‌లో రూ.25,990కే విక్రయిస్తున్నారు. కాబట్టి ఈ ఫోన్ కొనాలనుకునే వారికి ఇదే మంచి చాన్స్. ఇందులో ఎల్జీ అదిరిపోయే ఫీచర్లను, డ్యూయల్ డిస్ ప్లేను కూడా అందించింది.
ఎల్జీ జీ8ఎక్స్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫుల్‌విజన్ ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. మరో 6.4 అంగుళాల డిస్ ప్లేను కూడా ఇందులో అందించనున్నారు. ఈ ఫోన్‌లో ఒకేసారి రెండు స్క్రీన్లను ఉపయోగించవచ్చు. రెండో డిస్ ప్లేను మనకు కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను అందించారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. ఇక ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.
ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5 ఎల్ఈ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ 2.0 ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని బరువు 192 గ్రాములుగా ఉంది.
ఇందులో డ్యూయల్ డిస్ ప్లే కోసం ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఫీచర్లు అందించారు. వీటి ద్వారా వినియోగదారులు ఒక స్క్రీన్‌లో పూర్తి స్థాయిలో గేమ్ ఆడుతూ మరో స్క్రీన్‌లో జాయ్ స్టిక్ తరహాలో కంట్రోల్ చేయవచ్చు. దీంతో పాటు వినియోగదారులు స్క్రీన్లపై యాప్స్‌ను పిన్ చేసుకోవచ్చు. స్టాక్స్, స్పోర్ట్స్ స్కోర్లను ట్రాక్ చేసుకోవచ్చు.
Comments