వాహనదారులకు కీలక హెచ్చరిక.. మరో వారం రోజులే గడువు.. దాటితే రూ. 5 వేల ఫైన్.. తెలుసుకోండి
- Raju Shaik
- Dec 25, 2020
- 1 min read
మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. అయితే ఈ సమయంలో వాహనదారులు ముఖ్య విషయాన్ని గుర్తించుకోకపోతే.. న్యూ ఇయర్ ప్రారంభమైన వెంటనే ఫైన్ల మీద ఫైన్లు కట్టాల్సి వస్తుంది.

మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. అయితే ఈ సమయంలో వాహనదారులు ముఖ్య విషయాన్ని గుర్తించుకోకపోతే.. న్యూ ఇయర్ ప్రారంభమైన వెంటనే ఫైన్ల మీద ఫైన్లు కట్టాల్సి వస్తుంది.
బైక్, కారు, ఇంకా ఏ వాహనముతున్నా ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి. కరోనా విజృంభణ కారణంగా కేంద్ర ప్రభుత్వం అనేక వర్గాలకు పలు అంశాల్లో ఊరటనిచ్చింది.

ఇలా ఊరట పొందిన వారిలో వాహనదారులు కూడా ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్(Driving Licence), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వెహికల్ ఇన్సూరెన్స్ వంటి రెన్యూవల్ గడువును కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అనేక సార్లు పొడిగించింది.
అయితే తాజా గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. దీంతో వాహనదారులు తప్పనిసరిగా వారి గడువు ముగిసిన డాక్యుమెంట్లను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.

గడువు ముగిసిన అనంతరం ఒక వేళ ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే భారీగా జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఏకంగా రూ.5,000 ఫైన్ చెల్లించకతప్పదు.
ఇతర ధ్రువపత్రాలు లేక పోయినా జరిమానాలు భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి మీ ధ్రువపత్రాలను రెన్యువల్ చేయించుకోండి.
Comments